ఏ సినిమా పరాజయం కావాలనే అంచనాలో దర్శకుడు సినిమా తీయడు. అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి తరహాలో ఫలితాలు తారుమారు కావడం పరిశ్రమలో సర్వ సాధారణం. అయితే ఫలితం ఎలా ఉన్నా ఎంతో కొంత రాబట్టేలా సాధ్యమైనంత ఎక్కువ ప్రమోషన్ చేయడం చాలా అవసరం. కాని మిస్టర్ మజ్ను హీరో అఖిల్ తీరు దీనికి భిన్నంగా ఉండటం అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. విడుదల ముందు వరకు టీం తో కలిసి మీడియాకు విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన అఖిల్ తీరా మొదటివారం దాటకుండానే సైలెంట్ అయ్యాడు.
వసూళ్లు నిరాశజనకంగా ఉన్నప్పటికీ వాటిని కనీసం పుష్ చేసేందుకు అయినా హీరో జనానికి కనిపించాలి. తనే తెరచాటుకు వెళ్ళిపోతే ఏదో ఒకసారి చూద్దాంలే అనుకున్న ప్రేక్షకులు కూడా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. అయినా అఖిల్ ఇంత నిర్లిప్తంగా ఉండటం ఆశ్చర్యమే. ఒక పక్క రిజల్ట్ తో సంబంధం లేకుండా హీరొయిన్ నిధి అగర్వాల్ దర్శకుడు వెంకీ అట్లూరి రైటో రాంగో ఏదో ఒకటి సినిమా గురించి గొప్పగా చెబుతూ జనంతో కనెక్ట్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు.
అసలైన హీరో మాత్రం ఇలా సైలెంట్ కావడం చూస్తూనే తన సినిమా పోయిందని అఖిల్ ఒప్పుకున్న అర్థం వస్తుంది. 22 కోట్ల దాకా బిజినెస్ జరుపుకున్న మిస్టర్ మజ్ను అందులో సగం తెచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. ఎఫ్2 జోరు కాస్త చల్లబడినా ఆ ఛాన్స్ ని మజ్ను ఉపయోగించుకోవడం లేదు. హ్యాట్రిక్ పూర్తి చేసుకున్న అఖిల్ మొదటి సక్సెస్ కోసం ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పడం లేదు. అయితే ఇంతకు ముందులా ఎక్కువ గ్యాప్ తీసుకుంటాడా లేక ఈసారైనా ఫాస్ట్ డెసిషన్స్ ఉంటాయా చూడాలి