హంగామా సరే కలెక్షన్లు ఏవీ ?

Update: 2019-07-30 06:30 GMT
జూలై 26 విడుదల ముందురోజు వరకు కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ ప్రమోషన్ కోసం ఐదు రాష్ట్రాలు చుట్టిన విజయ్ దేవరకొండకు డియర్ కామ్రేడ్ ఇచ్చిన షాక్ మాములుగా లేదు. మొదటివారం పూర్తి కావడానికి ఇంకా రెండు రోజులు ఉండగానే కలెక్షన్లు దారుణంగా పడిపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చగా మారింది. సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నా కనీసం విజయ్ దేవరకొండ ఇమేజ్ ఓ వారం రోజులు నిలబెడుతుందనుకుంటే ఆ సూచనలు కూడా కనిపించడం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ల పేరుతో భారీ వ్యయంతో ఇంత హంగామా చేసిన విజయ్ కు ఈ ఫలితం చిన్న షాక్ కాదు.

మరోవైపు యుఎస్ లో మిలియన్ మార్క్ చేరుకోవడానికి నానా పురిటి నొప్పులు పడుతున్న కామ్రేడ్ ఇప్పుడు కనక అది రీచ్ కాకపోతే వచ్చే సినిమాల ఓవర్సీస్ బిజినెస్ మీద ప్రభావం చూపించడం ఖాయం. అర్జున్ రెడ్డి - పెళ్లి చూపులు - గీత గోవిందం చాలా ఈజీగా సాధించిన ఈ ఫీట్ కోసం కామ్రేడ్ ఇంతగా కష్టపడటం వింతే .ఇక్కడో గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. ఎలాంటి హడావిడి లేకుండా స్టార్ హీరో ఊసే రాకుండా కేవలం సమంతా అనే బ్రాండ్ ని నమ్ముకుని తీసిన కొరియన్ రీమేక్ ఓ బేబీ అమెరికాలో వన్ మిలియన్ చేరుకోవడం. అంటే అక్కడి ఆడియన్స్ తీర్పు విషయంలో ఎంత స్పష్టంగా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది.

మనం ఎంత గొప్పగా ప్రమోట్ చేసుకున్నా పబ్లిసిటీ కోసం ఎన్ని విన్యాసాలు చేసినా ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ ఫేట్ ని డిసైడ్ చేసేది కంటెంట్ తప్ప మరొకటి కాదని మళ్ళీ రుజువయ్యింది. యావరేజ్ గా ఉన్నా ఏదోలా సోషల్ మీడియా హెల్ప్ తోనో ఇంకో రకంగానో హిట్ అనిపించుకోవచ్చు కానీ డియర్ కామ్రేడ్ విషయంలో అలంటి  సూచనలు లేవు. మరి అంతేసి చెప్పుకున్న డియర్ కామ్రేడ్ కు ఇప్పుడు కలెక్షన్లు ఎందుకు లేవో హీరోతో సహా యూనిట్ ఓసారి విశ్లేషించుకుంటే పొరపాటు ఎక్కడ జరిగిందో అర్థమవుతుంది

    

Tags:    

Similar News