రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ RRR ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయిన సంగతి తెలిసిందే. మిగతా పెండింగ్ చిత్రీకరణ కోసం దర్శకహీరోలు మల్లగుల్లాలు పడుతున్నారు. మహమ్మారీ లాక్ డౌన్ అన్నివిధాలా ముప్పు తిప్పలు తెచ్చి పెట్టింది. ఈ ఐదారు నెలలుగా జక్కన్న నుంచి `రౌద్రం రణం రుధిరం`కి సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాకపోవడంతో అభిమానులు కూడా నిరాశగా ఉన్నారు. అల్లూరి సీతారామరాజు లుక్ రిలీజ్ చేసిన జక్కన్న కొమరం భీమ్ పాత్ర లుక్ ని రివీల్ చేయకపోవడం తాకర్ ఫ్యాన్స్ లో అసంతృప్తిని రాజేసింది.
ఇక ఈ మూవీలో ఆలియా భట్ అల్లూరి సరసన సీతగా కనిపించనుండగా బ్రిటీష్ నటి ఒలీవియా భీమ్ (తారక్) సరసన కనిపించనుంది. అలాగే అజయ్ దేవగణ్ ఒక వీరుడిగా కనిపిస్తారని ఆయన పాత్రకు కూడా చరణ్ .. తారక్ పాత్రలకు ధీటుగా ప్రాధాన్యతనిచ్చారని ప్రచారమవుతోంది. ఇక యాక్షన్ హీరో దేవగణ్ సరసన నాయిక ఎవరు? అన్నదానిపై ఇన్నాళ్లు అప్ డేట్ లేదు.
ఇటీవలే శ్రీయ స్వయంగా తాను ఆర్.ఆర్.ఆర్ లో దేవగణ్ సరసన కనిపిస్తానని ప్రకటించడంతో ఆ విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది. అదంతా సరే కానీ.. శ్రీయ మరో మాట కూడా చెప్పింది. ఈ సినిమాలో దేవగణ్ సరసన నటించే ఆఫర్ వచ్చినా చరణ్- తారక్ ఉన్న సీన్లలో కనిపించే భాగ్యం దక్కకపోవడంపై అసంతృప్తిగా ఉందని తెలిపింది. ఇక ఛత్రపతి లాంటి మాస్ సినిమాలో తనకు అవకాశం ఇచ్చిన రాజమౌళి మరోసారి అవకాశం ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేసింది. అజయ్ దేవగన్ జెంటిల్మన్.. మంచి మనిషి. ఆయన సరసన నటించడం సంతోషమేనని అంది.
1920 -47 మధ్య సాగే ఆసక్తికర ఫిక్షన్ కథాంశాన్ని విజయేంద్ర ప్రసాద్ అందించగా.. రాజమౌళి స్క్రిప్టుకు మెరుగులద్దారు. అల్లూరి- కొమరం భీమ్ పాత్రలు ఫిక్షనలైజ్డ్ గా తెరపై కనిపించనున్నాయి. డీవీవీ దానయ్య దాదాపు 350 కోట్లు వెచ్చించి ఈ సినిమాని నిర్మిస్తున్నారన్న సమాచారం ఉంది. వచ్చే ఏడాది జనవరి 8న మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా మహమ్మారీ వల్ల అనుకున్న ప్రకారం రిలీజవుతుందా? అన్నది సందిగ్ధమే.