విశ్వనటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా `భారతీయుడు 2` (ఇండియన్-2) షూటింగ్ శర వేగంగా పూర్తవుతోంది. చిత్రీకరణలో భాగంగా చిత్రబృందం దేశం మొత్తం చుట్టేస్తోంది. ఇప్పటికే తమిళనాడు- తెలంగాణ- ఆంధ్రప్రదేశ్- మహరాష్ట్రలను చుట్టేసింది. విదేశాల్లోను కీలక షెడ్యూల్ ని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ (ఎంపీ) లో చిత్రీకరణ సాగుతోంది. గ్వాలియర్ (ఎంపీ) పరిసరాల్లో అత్యంత కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షూట్ అనంతరం ఎంపీలో దట్టమైన అడవులు.. భూగర్భంలో నిక్షిప్తమైన బంగారు-వజ్రాల గనుల ప్రాంతంలో మరికొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారుట.
ఈ షెడ్యూల్ పూర్తవ్వడానికి చాలా రోజులు పడుతుందని సమాచారం. ఇక్కడ చిత్రీకరణ పూర్తి కాగానే తిరిగి యథావిధిగా చెన్నైలో నిర్మించిన ప్రత్యేక సెట్స్ లో షూటింగ్ చేయనున్నారు. అటుపై పంజాబ్- గుజరాత్ లోనూ ప్రధాన తారాగణంపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంటుందని యూనిట్ వెల్లడించింది. తాజాగా మూవీ రిలీజ్ తేదీ మరోసారి వాయిదా పడుతోందని తెలుస్తోంది. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి.. అటుపై నిర్మాణానంతర పనుల్ని ముగించి ఈ ఏడాది చివరినాటికి మూవీని రిలీజ్ చేయాలన్నది శంకర్ ఆలోచన. కానీ షూటింగ్.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తయ్యే ఆస్కారం లేదని తాజాగా ఓ అంచనాకి వచ్చారట. ఆ క్రమంలోనే రిలీజ్ ను 2021 ఫిబ్రవరికి వాయిదా వేసినట్లు చెబుతున్నారు.
పాన్ ఇండియా క్యాటగిరీ సినిమా కావడం.. భారతీయుడు లాంటి క్రేజీ చిత్రానికి సీక్వెల్ కావడంతో దర్శకుడు శంకర్- లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి రాజీకి రావడం లేదట. అందుకే మరోసారి రిలీజ్ తేదీ మారుతోందన్నది టీమ్ నుంచి లీకు అందింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వల్ హీరోయిన్. సిద్ధార్థ్- రకుల్ ప్రతీసింగ్- బాబిసింహా - సముదిర ఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.