మలయాళం ఇండస్ర్టీకి దుల్కార్ సల్మాన్ మెగాస్టార్ మమ్ముట్టి వారసత్వంలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. యంగ్ హీరో తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్తున్నాడు. కన్నడ..తమిళ్..తెలుగు చిత్రాల్లోనూ తన ఐడెంటిటీని వేసాడు. తండ్రి పెద్ద స్టార్ అయినా ఆ ఇమేజ్ ఏమాత్రం తనపై పడకుండా తనకు తానుగానై పైకి ఎదుగుతున్నాడు. ఇంతిత్తై వటుడింతైన చందంగా కెరీర్ ని బిల్డ్ చేసుకుంటున్నాడు. తక్కువ సమయంలోనే నటుడిగా వెండి తెరపై తన ముద్రని వేసాడు. మాలీవుడ్ టాప్ హీరోల సరసన అనతి కాలంలోనే స్థానం సంపాదించాడు.
ఇదంతా కేవలం తన ట్యాలెంట్ తోనే. తండ్రి ప్రభావం ఉన్నా అది కేవలం అవకాశాలు అందిపుచ్చుకోవడం వరకే. ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తనయుడిపైనే ఉంటుంది. ఆ విషయంలో దుల్కార్ సల్మాన్ తెలివైన నిర్ణయాలతో అడుగులేసి సక్సెస్ అయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తండ్రితో కలిసి సినిమా ఎప్పుడు చేస్తున్నారు? అని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ``నాన్నతో కలిసి పనిచేయాలని నేను అనుకుంటున్నాను. కానీ సోలోగానే పనిచేయడం మంచింది. నా ఎంట్రీ ఆ రకంగానే జరిగింది. కాబట్టి నటుడిగా అలాగే కొనసాగాలనుకుంటున్నాను.
తండ్రి ఇమేజ్ నాపై సహజంగానే ఉంటుంది. నేను వద్దనుకున్నా...ఆ బాధ్యత నేను తీప్పక తీసుకోవాల్సింది. అది ఎంతో బరువైన బాధ్యత. ఆ విషయంలో హుందాగా వ్యవహరించాలి. నాపై ఒత్తిడి తీసుకొచ్చే అంశం కూడా. నాన్నతో స్ర్కీన్ షేర్ చేసుకుంటే నా ఇమేజ్ రెట్టింపు అవుతుంది. కానీ అందులో నేనెక్కడ ఉంటాను? అన్నసందేహం ఉంది. నేను ఆయనతో నటించాలా? వద్దా? అన్నది నాన్న డిసైడ్ చేస్తారు. ఇలాంటి విషయాల్లో నాకు నేనుగా నిర్ణయాలు తీసుకోను`` అని అన్నారు.
వారతస్వంతో ఎంట్రీ ఇచ్చిన కుమారులు తండ్రితో సైతం తెరను పంచుకోవాలని ఆశపడటం సహజం. మల్టీస్టారర్ చిత్రాల కేటగిరీలో ఇలాంటి కాంబినేషన్స్ సెట్ అవుతుంటాయి. ఆ చిత్రాలపై భారీ అంచనాలు నెలకొంటాయి. రిలీజ్ తర్వాత సక్సెస్ అయితే భారీ వసూళ్లను దక్కించుకుంటాయి. `ఆచార్య` సినిమాతో మెగాస్టార్ చిరంజీవి- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాంటి ప్రయత్నానినిక పూనుకుంటోన్న సంగతి తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీ ఇంట హీరోలంతా కలిసి `మనం` అనే సినిమా చేసారు. అటుపై ఇటీవలే `బంగార్రాజు` చిత్రంలో నాగార్జున-నాగచైతన్య కలిసి నటించి మరో సక్సెస్ ఖాతా వేసుకున్నారు.
చైతన్య మేనమామ వెంకటేష్ తో సైతం కలిసి తెరను పంచుకుని సక్సెస్ అందుకున్నారు. తెలుగులో ఈ ఒరవడి కొత్తేం కాదు. దశాబ్ధాలుగా ఉన్నదే. ఇప్పుడు పాన్ ఇండియా కంటెంట్ అప్పీల్ తోనూ కోట్ల ని కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇలాంటి ఇమేజ్ తనకెంత మాత్రం ఇష్టం లేదని దుల్కార్ చెప్పకనే చెప్పే ప్రయత్నంచేసాడు.