కరణ్ జోహార్ పేరు ఎందుకు ఉపయోగించడం లేదు...?

Update: 2020-08-02 17:31 GMT
బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ''గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్''. భారత దేశపు తొలి మహిళా ఐఏఎఫ్‌ పైలట్‌.. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న లేడీ పైలట్  గా ఖ్యాతికెక్కిన గుంజన్‌ సక్సేనా జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. శరణ్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ బయోపిక్ ని ఆగష్టు 12న ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్‌ ప్లిక్స్ లో విడుదల చేస్తున్నారు. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ - జీ స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన 'గుంజన్‌ సక్సేనా' ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. అయితే బాలీవుడ్ వివాదాస్పద నటుడు కమల్ ఆర్ ఖాన్ ఈ ట్రైలర్ పై పలు సందేహాలు వ్యక్తం చేసారు.

కాగా కమల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ''ఈ చిత్రాన్ని కరణ్ జోహర్ నిర్మించారు. కానీ నెట్ ఫ్లిక్స్ ఎక్కడా అతని పేరును ఉపయోగించడం లేదు. నేపో కిడ్ జాన్వీ కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారంటే ఇది 100% నెపోటిజంతో నిండి ఉంది. అందువల్ల నేను సినిమాను బహిష్కరిస్తాను. మీరందరూ దీనిని బాయ్ కాట్ చేస్తారని ఆశిస్తున్నాను'' అని ట్వీట్ చేసారు. నిజానికి నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసిన 'గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్' ట్రైలర్ లో ఈ సినిమాకి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నేమ్ ఎక్కడా మెన్షన్ చేయలేదు. రీజనల్ సినిమాలకే నెట్ ఫిక్స్ వారు సినిమాకి వర్క్ చేసిన వారి పేర్లు మెన్షన్ చేస్తుంటే కరణ్ జోహార్ ని విస్మరించడం ఏంటని అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కరణ్ పై వస్తున్న విమర్శల కారణంగానే ఓటీటీ వారు ట్రైలర్ లో అతని పేరు ఉపయోగించలేదా అనే అనుమానం వ్యకం చేస్తారు. అయితే కొంతమంది నెటిజన్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ చాలా సినిమాలకు టైటిల్స్ లో ఎవరి నేమ్ ఉపయోగించదని.. ట్వీట్ లో కరణ్ జోహార్ ని మెన్షన్ చేసారని కామెంట్స్ పెడుతున్నారు.

ఇదిలా ఉండగా కమల్ ఆర్ ఖాన్ మరో ట్వీట్ చేస్తూ.. ''మీరు గుంజన్‌ సక్సేనాను చూడకుండా జీరో వ్యూయర్ షిప్ వచ్చిన సినిమాగా చేయగలిగితే అది బాలీవుడ్ మరియు నెపోటిజంకి వ్యతిరేకంగా మీ మొదటి విజయం అవుతుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి ఘనమైన నివాళి అవుతుంది. కాబట్టి అందరం కలిసి అవినీతిపరులకు వ్యతిరేకంగా మన యూనిటీని చాటుదాం'' అని పేర్కొన్నాడు. దీనిపై కొందరు అతనిని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు ఇది కరెక్ట్ కాదని అంటున్నారు.
Tags:    

Similar News