ఆ హీరోయిన్ డిలీట్ చేసిన ట్వీట్ అర్థమేంటో మరి!

Update: 2020-03-29 11:58 GMT
హీరోయిన్ పూనమ్ కపూర్ సినిమాల ద్వారా కంటే వివాదాల ద్వారా  సాధించిన పాపులారిటీనే ఎక్కువ.  ట్విట్టర్ లో అప్పుడప్పుడూ ఏదో ఒక ట్వీట్ తో అందరి దృష్టిని ఆకర్షించడం పూనమ్ కు అలవాటే.  శనివారం ఉదయం కూడా అలాగే ఓ అర్థం అయ్యి అర్థం కాని ఓ ట్వీట్ వేసింది. ఏమైందో ఏమో కానీ ఒకే నిముషంలో సదరు నర్మగర్భమైన ట్వీట్ ను డిలీట్ చేసేసింది.

అయితే నెటిజన్లు ఊరుకోరు కదా. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చెయ్యడం వరకూ మన చేతిలో ఉంటుంది కానీ ఆ తర్వాత మన చేతిలో ఉండదు. ఇంతకీ పూనమ్ ట్వీట్ ఏంటంటే "డైరెక్టర్.. ఆయన తో ఉన్న నటి!!! నువ్వు ఎంత ఫ్లాప్ హీరోయిన్ అయినా నువ్వు అంత తక్కువకు యాక్ట్ చెయ్యకూడదు.. ఈ వ్యక్తి తన పవర్ ను తప్పుగా వాడుతూ ఇండస్ట్రీలో చాలా చోట్ల తన చెంచాలను ఉంచుతున్నాడు.. వారికి కార్లను.. ఇతర తాయిలాలను ఇస్తున్నాడు.  నువ్వు ఎంత టాలెంటెడ్ అయినప్పటికీ నువ్వు అతని మాట వినకపోతే".

ఆ డైరెక్టర్ ఎవరో.. ఆ హీరోయిన్ ఎవరో మరి.  దీని అర్థం ఏమిటో ఫుల్ అర్థం అయిన వారు ఫుల్ అర్థం చేసుకోండి. క్వార్టర్ అయితే క్వార్టర్ అర్థం చేసుకోండి. అసలు ఒక్క ఔన్సు కూడా అర్థం  కాలేదంటే "సరేలే.. అన్నీ మనకు అర్థం అవుతాయా.. అన్నీ మన కంట్రోల్ లో ఉంటాయా. అందులో ఇదీ ఒకటి" అని సరిపెట్టుకోండి.


Tags:    

Similar News