నేషనల్ క్రాష్ రష్మిక మందన్న అంటే తెలియని వారుండరు. కన్నడ మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక్కడ ఈమె చేసిన చిత్రాలన్నీ మంచి విజయం సాధించడంతో లక్కీ హీరోయిన్ గా కూడా ముద్ర వేయించుకుంది. ప్రస్తుతం రష్మిక తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళ భాషల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.
అయితే ఈమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో 'సీతా రామమ్' ఒకటి. యుద్దంతో రాసిన ప్రేమ కథ అనేది ట్యాగ్ లైన్. అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ వంటి లవ్ స్టోరీలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తుండగా.. రష్మిక మందన్న, మృణాళిని ఠాకూర్ హీరోయిన్లుగా చేస్తున్నారు. సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ రష్మికనే అని చాలా మంది అనుకున్నారు.
కానీ, అందులో ఏ మాత్రం నిజం లేదట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు హను రాఘవపూడినే తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. 'ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ కాదు. ఆఫ్రీన్ అనే ముస్టిం మహిళ పాత్రను రష్మిక పోషిస్తోంది.
ఇందులో ఆమెది ఓ కీలక పాత్ర. అంతేకానీ, హీరోయిన్ కాదు. ఈ సినిమాలో రష్మిక పాత్రకి డైలాగ్స్ కూడా పెద్దగా ఉండవు .. కళ్ళతోనే హావభావాలను పలికిస్తుంది. ఎంతో మంది పేర్లను పరిశీలించి ఈ పాత్ర కోసం ఆమెను ఎంపిక చేయడం జరిగింది' అంటూ చెప్పుకొచ్చారు. ఈయన మాటల బట్టీ చూస్తుంటే.. మృణాళిని ఠాకూర్ హీరోయిన్ అని, రష్మిక సహాయక పాత్రలో నటిస్తుందని స్పష్టంగా అర్థమైంది.
అయితే ఇప్పుడీ విషయమే నెట్టింట చర్చకు దారి తీసింది. స్టార్ హీరోయిన్‌గా ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ దుసుకుపోతున్న టైమ్‌లో రష్మిక ఇలా సహాయక పాత్రలు చేయడం అవసరమా..?, అసలెందుకిలా చేస్తుంది..? అంటూ కొందరు నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు అభిమానులు సైతం రష్మిక సహాయక పాత్రలను పోషించడం ఏ మాత్రం నచ్చలేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.