రేణుదేశాయ్‌ పెళ్లి సంగతి ఏంటీ?

Update: 2019-02-20 08:23 GMT
రేణుదేశాయ్‌ పవన్‌ కళ్యాణ్‌ నుండి విడాకులు తీసుకున్న తర్వాత పిల్లలతో కలిసి మహారాష్ట్రలో ఉంటున్న విషయం తెల్సిందే. పిల్లలను చూసుకుంటూ అప్పుడప్పుడు మరాఠి సినిమాలపై దృష్టి పెట్టిన రేణుదేశాయ్‌ చాలా ఆలోచించి చివరకు రెండవ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే రేణుదేశాయ్‌ పూణెకు చెందిన ఒక వ్యక్తితో వివాహ నిశ్చితార్థం కూడా చేసుకుంది. వివాహ నిశ్చితార్థంను సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించిన రేణు దేశాయ్‌ పెళ్లి విషయంలో ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

రేణుదేశాయ్‌ వివాహ నిశ్చితార్థం గత ఏడాది జూన్‌ లో జరిగింది. దాదాపు ఎనిమిది నెలలు అవుతున్నా కూడా పెళ్లి గురించిన ఎలాంటి ప్రకటన కాని, వార్త కాని రావడం లేదు. నిశ్చితార్థం సమయంలో పవన్‌ అభిమానులు ఆమెను చాలా ఇబ్బంది పెట్టారు. దాంతో ఆమె పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తిని చూపించలేదు. పవన్‌ అభిమానులకు భయపడి పెళ్లిని కూడా రేణు దేశాయ్‌ చెప్పడం లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేణు దేశాయ్‌ పెళ్లి చేసుకుని ఉంటుందా అనిపిస్తుంది.

తాజాగా నటిగా రేణు దేశాయ్‌ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. నటిగా బిజీ అయితే పెళ్లి గురించి ఆలోచించే అవకాశం ఉండదు. అయితే పెళ్లి అయ్యింది కనుకే నటిగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యిందని కూడా కొందరు అనుకుంటున్నారు. మొత్తానికి రేణుదేశాయ్‌ వివాహం గురించి ఎలాంటి ప్రకటన రాకపోవడం విచిత్రంగా ఉంది. రేణు దేశాయ్‌ సస్పెన్స్‌ లేదా సైలెన్స్‌ మెయింటెన్‌ చేస్తుందా లేదంటే ఏదైనా కారణం వల్ల పెళ్లి ఆలస్యం అవుతుందా అనేది ఆమె నోరు విప్పితే కాని తెలియదు.
Tags:    

Similar News