'పీఎం మోడీ' పై స్టార్ హీరో ఆగ్రహం

Update: 2019-06-27 05:47 GMT
ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్‌ 'పీఎం నరేంద్ర మోడీ' చిత్రం కొన్ని రోజుల క్రితం విడుదలైన విషయం తెల్సిందే. ఎన్నికల ముందు ఈ చిత్రంను విడుదల చేసేందుకు నిర్మాతలు చాలా ప్రయత్నాలు చేశారు. కాని ఎన్నికల కమీషన్‌ మాత్రం సినిమా విడుదలకు అడ్డుకుంది. కోర్టుకు వెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఎన్నికల పక్రియ పూర్తి అయ్యి.. ప్రధానిగా నరేంద్ర మోడీ మరోసారి పదవి బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఈ చిత్రంను విడుదల చేయడం జరిగింది.

ప్రధాని రెండవ సారి విజయకేతనం ఎగరేయడం జరిగింది. కాని సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. సాదా సీదా డాక్యుమెంటరీ తరహాలో సినిమాను తెరకెక్కించారంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇక తాజాగా ఈ చిత్రంపై బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ చిత్రంలో కొన్ని పాత సినిమాల పాటలను వాడటం జరిగింది. అయితే ఆ పాటల రచయితలకు టైటిల్‌ కార్డ్‌ లో క్రెడిట్‌ ఇచ్చారు. అయితే ముందస్తు అనుమతి తీసుకున్నారో లేదో కాని సల్మాన్‌ ఖాన్‌ నటించిన 'దస్‌' చిత్రంలోని సునో గౌర్‌ సే దునియా వలో... అనే పాటను పెట్టడం జరిగింది.

'మోడీ' సినిమాలో తన పాటను పెట్టడం పట్ల సల్మాన్‌ ఖాన్‌ అగ్రహం వ్యక్తం చేశాడట. చాలా ఏళ్ల క్రితం సల్మాన్‌ ఖాన్‌.. సంజయ్‌ దత్‌.. రవీనా టాండన్‌.. శిల్పాశెట్టి లతో ముకుల్‌ ఆనంద్‌ 'దస్‌' సినిమాను ప్రారంభించాడు. సినిమా షూటింగ్‌ దశలో ఉండగా ముకుల్‌ ఆనంద్‌ గుండెపోటుతో మృతి చెందాడు. దాంతో ఆ సినిమా అలాగే ఉండిపోయింది. ఆ సినిమాలోని పాటను ఇప్పుడు మోడీలో వాడారు.

ఐశ్వర్యరాయ్‌ విషయంలో కొన్ని సంవత్సరాల క్రితం సల్మాన్‌ ఖాన్‌ మరియు వివేక్‌ ఒబేరాయ్‌ ల మద్య పెద్ద గొడవలే జరిగాయి. అప్పట్లో సల్మాన్‌ నన్ను చంపేస్తానంటూ బెదిరించాడంటూ మీడియా ముందుకు వచ్చి మరీ వివేక్‌ ఒబేరాయ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పటి నుండి కూడా ఇద్దరి మద్య సన్నిహిత్యం లేదు. అలాంటి వివేక్‌ ఒబేరాయ్‌ నటించిన 'మోడీ' సినిమాలో తన పాట పెట్టడంతో సల్మాన్‌ కు కోపం వచ్చిందని బాలీవుడ్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొన్నటి వరకు తన సినిమా 'భారత్‌' తో బిజీగా ఉన్న సల్మాన్‌ ఇప్పుడు మోడీ గురించి స్పందించాడట.
Tags:    

Similar News