అది సరే శామ్.. ప్రేమమ్ సంగతేంటి?

Update: 2016-09-22 09:04 GMT
తను చేసిన సినిమాలపైనే కాదు.. తనకు నచ్చిన సినిమాల పైనా.. ట్వీట్స్ చేయడం సమంతకు అలవాటు. అంతే కాదు.. అభిమానులతో అనేక సంగతులు షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం ఈ భామ హ్యాబిట్. రీసెంట్ గా పింక్ మూవీని.. ఆ చిత్ర యూనిట్ ని తెగ పొగిడేస్తూ ట్వీట్ చేసింది సమంత.

'ఈ ఏడాది మనం చూసిన సినిమాల్లో పింక్ చాలా ముఖ్యమైనది. బ్రిలియంట్. టీమ్ నా గ్రేట్ రెస్పెక్ట్' అంటూ ట్వీట్ చేసింది సమంత. తాప్సీ నటించిన మూవీపై ట్వీట్ బాగానే ఉంది కానీ.. జనాలు ఈమె దగ్గర నుంచి ఆశిస్తున్నది వేరే ఉంది. శామ్ కు కాబోయే భర్త అయిన నాగచైతన్య అప్ కమింగ్ మూవీ ప్రేమమ్ పై.. సమంత ట్వీట్ ఎలా ఉంటుందోననే ఆసక్తి నెలకొంది. అయితే.. సమంత మాత్రం ప్రేమమ్ పై తను ఎలాంటి ట్వీట్ చేయడం లేదు సరి కదా.. కనీసం చైతు ట్వీట్ ను రీట్వీట్ కూడా చేయడం లేదు. పింక్.. జనతా గ్యారేజ్ లపై ట్వీట్లతో సరిపెట్టేస్తోంది.

ప్రేమమ్ పై తన ట్వీట్ పై ఆసక్తి ఉందనే సంగతి సమంతకు బాగానే తెలుసు. ఇప్పటికే బోలెడన్ని క్వశ్చన్స్ ఆమె టైమ్ లైన్ లో పోస్ట్ అవుతున్నాయి. ఈ క్యూరియాసిటీని మరింతగా పెంచేసే వ్యూహం తోనే.. సమంత ఇలా ఉద్దేశ్యపూర్వకంగా ప్రేమమ్ పై ట్వీట్లను అవాయిడ్ చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. చూస్తుంటే ఈమె ఆలోచన వర్కవుట్ అయ్యేలానే ఉంది.
Tags:    

Similar News