మామ మీద అలిగారా బేబి గారు?

Update: 2019-08-09 08:37 GMT
అక్కినేని నాగార్జున న‌టించిన మ‌న్మ‌ధుడు 2 ఈ శుక్ర‌వారం రిలీజైంది. ఇప్ప‌టికే స‌మీక్ష‌లు వ‌చ్చేశాయి. అయితే మామ న‌టించిన‌ సినిమాపై ఇప్ప‌టివ‌ర‌కూ కోడ‌లు ఇంత‌వ‌ర‌కూ రివ్యూ చెప్పనే లేదు. అస‌లు సిన‌మా ఎలా ఉంది? త‌న‌కు న‌చ్చిందా లేదా? ఏదీ క‌నీసం సామాజిక మాధ్య‌మాల్లో అయినా చెప్ప‌నేలేదు. అప్ప‌ట్లో `మ‌న్మ‌ధుడు 2` ట్రైల‌ర్ రాగానే ఏదో ట్వీట్ అయితే చేసింది కానీ ఆ త‌ర్వాత అస్స‌లు ప‌ట్టించుకోనే లేదు. ఇప్ప‌టివ‌ర‌కూ ఒక ట్వీట్ లేదు.. ఇన్ స్టాలో పోస్టింగ్ లేదు. అంటే మూవీ త‌న‌కు న‌చ్చ‌లేద‌నే దాన‌ర్థ‌మా?

మామ గారు ఈ ఏజ్ లో ఘాటైన రొమాన్స్ చేయ‌డం.. ముద్దులివ్వ‌డం త‌న‌కు బ‌హుశా న‌చ్చ‌లేదు. ఆ సంగ‌తిని ఇదివ‌ర‌కూ నాగ్ ప‌బ్లిగ్గా రివీల్ చేశారు కూడా. అక్కినేని సినిమాల‌న్నిటికీ స‌మంత‌నే బిగ్ ప్ర‌మోట‌ర్. కానీ ఇప్పుడిలా చేస్తున్నారేంటో? ఇక ఓ బేబి సక్సెసైనందుకు ఎంతో ఆనందం వ్య‌క్తం చేసిన మామ కోసం ఆమాత్రం కూడా చేయ‌రా సామ్?

పెళ్లి త‌ర్వాత కూడా ఎంతో స్వేచ్ఛ గా బోల్డ్ అవ‌తారంలో క‌నిపించిన‌ప్పుడు లేనిది? ఇలా ఇప్పుడే ఎందుకు ఈ కండీష‌న్స్?  పైగా స్నేహితురాలు చిన్మ‌యి కోసం అయినా త‌న భ‌ర్త రాహుల్ స‌క్సెస్ కోస‌మైనా ఒక ట్వీట్ చేయ‌రా? ఏమిటో ఈ విచిత్రం? అంటూ అభిమానుల్లో ఒక‌టే ఆస‌క్తిగా ముచ్చ‌ట సాగుతోంది. మ‌రి వీట‌న్నిటికీ స‌మాధానం ఏం ఉందో సామ్ ద‌గ్గ‌ర‌.


Tags:    

Similar News