బాలసుబ్రహ్మణ్యమంటే మధురమైన గీతాలకు చిరునామా మాత్రమే కాదు... ఎందరో గొప్ప నటులకు గొంతునిచ్చి తెలుగు భాషకు పరిచయం చేసిన స్వరావధాని. ఆయన పాటలంటే చెవి కోసుకుంటాం.. మాట వింటే మైమరిచిపోతాం. పరభాషా ప్రముఖ హీరోలకు ఆయన డబ్బింగ్ చెప్పిన సందర్భాలున్నాయి. ప్రముఖ హీరో కమల్ హాసన్ కు బాలు డబ్బింగ్ చెబితే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలిసిందే కదా. పాటలను ఎంతగా ప్రేమిస్తారో బాలు మాటలను కూడా అలాగే ప్రేమించాలంటున్నారాయన. డబ్బింగ్ అంటే ఆషామాషీ కాదని... డబ్బింగ్ వల్ల ఇతర భాషల్లోని గొప్ప నటులు తెలుగువారికి పరిచయమయ్యారని చెబుతున్నారు. డబ్బింగ్ సినిమాలను నిషేధించాలని అనడం సరికాదని చెప్పుకొచ్చారు. ‘‘నేరుగా తెలుగు సినిమా చేయడం కన్నా, వేరే భాషలోని సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేయడం చాలా కష్టం. డబ్బింగ్ చాలా గొప్ప ప్రక్రియ. శివాజీ గణేశన్ లాంటి మహానటులు తెలుగులో దశరథరామయ్య - కె.వి.ఎస్. శర్మ - జగ్గయ్య లాంటి వారి గొంతు ద్వారానే తెలుగువారికి తెలిశారు. డబ్బింగ్ సినిమాలు లేకుంటే అలాంటి గొప్ప కళాకారుల సినిమాలను చూసేవాళ్లమా’’ అన్నారు. ‘తెలుగు సినిమాల్లో డబ్బింగ్ పాటలు’ పేరిట డాక్టర్ పైడిపాల రచించిన పరిశోధనా గ్రంథాన్ని ఇటీవల ఆయన ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బింగ్ గొప్పదనాన్ని వివరించారు.
పెద్ద నటులు నటించిన పెద్ద సినిమాల కన్నా చిన్న నటులు చేసిన చిన్న డబ్బింగ్ సినిమాలు బాగా ఆడుతున్న విషయాన్ని బాలు గుర్తు చేశారు. డబ్బింగ్ సినిమాల్ని నిషేధించాలనే వాదన సినీ పరిశ్రమలో కొందరు పెద్దల నోటి నుంచి వస్తోందని... అది మంచి ఆలోచన కాదని అన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు బలవంతంతో తాను ‘మన్మథలీల’ సినిమాతో అనుకోకుండా డబ్బింగ్ కళాకారుడినయ్యానని చెప్పిన ఆయన కమలహాసన్ ‘దశావతారం’ తెలుగు రూపంలో 8 పాత్రలకు డబ్బింగ్ చెప్పిన క్లిష్టమైన అనుభవాన్నిపంచుకున్నారు. తెలుగులోకి సినిమాను డబ్బింగ్ చేసే ప్రక్రియకు ఆద్యుడు శ్రీశ్రీ అని చెప్పారు. కాగా డబ్బింగ్ సినిమాలకు మద్దతు పలుకుతున్న బాలు ఒకప్పుడు పరభాషా గాయకుల విషయంలో మాత్రం చాలా కఠిన వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. వారితో పాడించకూడదంటూ ఒక దశలో ఆయన గొంతు చించుకున్నారు. వారి వల్ల తెలుగు గాయకుల అవకాశాలు పోతున్నాయని... వారిని నిషేధించాలని అనేవారు. ఆ విషయంలో పలువురు సంగీత దర్శకులపైనా ఆయన విమర్శలు చేసిన సందర్భాలున్నాయి.