వ‌ర్శిటీ అధినేత‌కు సినిమా పిచ్చేమిటో?

Update: 2019-07-29 17:30 GMT
ఆయ‌న బెజవాడ‌లో బ‌డా ఎంట‌ర్ ప్రెన్యూర్. విద్యారంగంలో ప్రొఫెస‌ర్. 40ఏళ్ల‌ సుదీర్ఘ‌మైన చ‌రిత్ర ఉన్న‌ కె.ఎల్.యూనివ‌ర్శిటీ(ఇంజినీరింగ్ విద్య‌)కి క‌ర్త క‌ర్మ క్రియ ఆయ‌నే. తండ్రి ల‌క్ష్మ‌య్య‌ ఫౌండ‌ర్ గా ఉంటే ఆయ‌నే ఆ యూనివ‌ర్శిటీని వేల కోట్ల మెగా ప్రాజెక్టుగా ఎస్టాబ్లిష్ చేశారు. అయితే తానొక‌టి త‌లిస్తే దైవం ఇంకొక‌టి త‌లిచిన చందంగా స‌ద‌రు యూనివ‌ర్శిటీ అధినేత ఊహించ‌ని విధంగా సినిమా రంగంలోకి వ‌చ్చి ప‌డ్డారు. త‌న‌యుడు న‌టించిన తొలి సినిమాతోనే న‌టుడిగా ఆక‌ట్టుకోవ‌డంతో హీరోగా పెద్ద భ‌విష్య‌త్ ని ఆశించారు. అయితే వార‌స‌త్వ (నెప్టోయిజం) ప‌రిశ్ర‌మ‌లో సినిమా బిజినెస్ అంత సులువేమీ కాదని స్టార్ డ‌మ్ ని అందిపుచ్చుకోవ‌డం ఇంకా చాలా క‌ష్ట‌మ‌ని ఆయ‌న‌కు ప్రాక్టిక‌ల్ గా అర్థ‌మైంది. స‌హ‌జంగానే విద్యావేత్త‌లు గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీని న‌మ్మ‌రు. స‌క్సెస్ రేటు లెక్క‌లు గ‌ణాంకాలు అంటూ చాలానే ఉంటాయి. అందుకే అస‌లు ఈ రంగంలో ఎందుకు? అనుకున్న ఆయ‌న కొడుకుపై ప్రేమ‌తో త‌ప్ప‌నిస‌రై రావాల్సొచ్చింది. ఇంత‌కీ ఆ ఇద్ద‌రి పేర్లు చెప్పాలా.. ? అవ‌స‌రం లేదేమో! హీరో హ‌వీష్ - నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ గురించే ఇదంతా.

కొడుకు హ‌వీష్ హీరోగా నిర్మాత‌గానూ సినిమాలు తీస్తున్నారు ఆయ‌న‌. ఫ్లాపులొచ్చినా.. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధ‌మే లేకుండా నిరాశ అన్న‌దే లేకుండా అత‌డు సినిమాల్ని నిర్మిస్తున్నారు. ఇది కేవ‌లం త‌న‌యుడిపై ప్రేమ‌తోనే అని తెలుస్తోంది. ఇక‌పోతే కుమారుడు త‌క్కువేమీ కాదు. అత‌డు సాంకేతిక విద్య‌లో పెద్ద చ‌దువులు చ‌దువుకున్నాడు. ప్ర‌స్తుతం కె.ఎల్.యూనివ‌ర్శిటీ బోర్డ్ మెంబ‌ర్స్ లో ఒక‌నిగా.. సంస్థ‌ సీఈవోగానూ కొన‌సాగుతున్నారు. అంతేనా హైద‌రాబాద్ ల‌నూ కె.ఎల్.యూనివ‌ర్శిటీని ప్ర‌స్తుతం విస్త‌రిస్తున్నారు. ఇక్క‌డ ఇప్ప‌టికే కొన్ని ఎక‌రాల స్థ‌లంలో కె.ఎల్.యూనివ‌ర్శిటీని నిర్మిస్తున్నారు. భ‌వంతులు రెడీ అవుతున్నాయ‌ట‌.

అయితే ఓవైపు యూనివ‌ర్శిటీ బాధ్య‌త‌లు మ‌రోవైపు హీరోగానూ అత‌డు రెండు పడ‌వ‌ల్ని బాగానే లాగేస్తున్నారు. ఇటీవ‌లే హ‌వీష్ న‌టించిన `సెవెన్‌-7` రిలీజైంది. ఈలోగానే హ‌వీష్ - స‌త్య‌నారాయ‌ణ సంయుక్తంగా నిర్మించిన `రాక్ష‌సుడు` ఈ శుక్ర‌వారం (ఆగస్టు 2) రిలీజవుతోంది. బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాకి ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త‌మిళంలో విజ‌యం సాధించిన రాక్ష‌స‌న్ కి రీమేక్ ఇది. ఇక ఒరిజిన‌ల్ లో ఎలాంటి మార్పులు చేయ‌కుండా తెలుగులో తెర‌కెక్కించడం క‌త్తిమీద సాములా మారింద‌ని నిర్మాత స‌త్య‌నారాయణ తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. మాతృక చూశాను. త‌మిళ‌ భాష తెలియ‌క‌ స‌గ‌మే అర్థ‌మైనా సినిమా మాత్రం బాగా న‌చ్చేసింది. అందుకే రీమేక్ హ‌క్కులు తీసుకుని నిర్మించామ‌ని తెలిపారు. రెడ్ కెమెరాల గురించి.. సినిమాల క‌థ‌ల గురించి స‌ద‌రు యూనివ‌ర్శిటీ ప్రొఫెస‌ర్ ఇంట‌ర్వ్యూలో వ‌ర్ణిస్తుంటే వినేవాళ్ల‌కు ఎంతో ముచ్చ‌ట క‌లుగుతోంది.

సినీ నిర్మాణం పై మీ అభిప్రాయం ఏమిటి ? అని ప్ర‌శ్నిస్తే.. ఆయ‌న చెప్పిన మ‌రో మాటా బిగ్ షాక్ నే ఇచ్చింది. అస‌లు సినిమా ఎలా తీయాలో త‌న‌దైన శైలిలో వివ‌రించిన స‌త్య‌నారాయ‌ణ ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర‌కూ నిర్మాత ఎలా ఉండాలో చెప్పిన తీరు ఆక‌ట్టుకుంది. సినిమాకి ప్రొడ‌క్ష‌న్ ద‌శ నుంచి క్లారిటీ ఉండాల‌ని ఆయ‌న క్లాస్ తీస్కున్నారు. కథ కథనం మాటలే సినిమాకి మెయిన్. కానీ మనవాళ్ళు మాత్రం ఏదో హడావుడిగా కథ మాటలు రాయించుకోని ప్రొడక్షన్ కి వెళ్ళిపోతారు. అది పూర్తిగా రాంగ్ అని అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ లోనూ చాలా క్లారిటీగా ఉండాలి. సినిమా రిలీజ్ టైమ్ కూడా చాలా ముఖ్యం అని అన్నారు. తాను సినీ నిర్మాణంలోకి రావడానికి కారణం వేరు(కొడుకుపై ప్రేమ‌). మరో కారణం ఎంటర్ టైన్ మెంట్ యూనివర్సిటీ పెట్టాలనేది నా గోల్ అని చెప్పి షాకిచ్చారు.
Tags:    

Similar News