ప్రముఖ రచయిత మధు బాబు అందించిన 'షాడో' నవల ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ నవలగా తెలుగు రీడర్స్ ని విశేషంగా ఆకట్టుకున్న ఈ నవలలోని పలు కీలక సన్నివేశాలని పలువురు దర్శకులు ఇప్పటికే ఫ్రీ గా కాపీ చేసి లేపేశారు. అయితే ఇన్నేళ్ల తరువాత ఈ పాపులర్ నవలని వెబ్ సీరీస్ గా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. 70 నుంచి 80 వ దశకం లో పాపులర్ అయిన ఈ నవలా హక్కుల్ని మాస్ మహారాజా రవితేజ దర్శకుడు శరత్ మండవ దక్కించుకున్నారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దర్శకుడు శరత్ మండవ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు.
రీసెంట్ గా మాస్ మహారాజా రవితేజతో 'రామారావు ఆన్ డ్యూటీ' పేరుతో ఓ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాని తెరకెక్కించారు. జూలై 29న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఊహించని విధంగా డిజాస్టర్ అనిపించుకుని దర్శకుడు శరత్ మండవకు భారీ షాక్ ఇచ్చింది.
దీంతో సోషల్ మీడియా ట్విట్టర్ నుంచి నిష్క్రమించిన దర్శకుడు గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయాడు. అయితే తాజాగా తను మధుబాబు ఫేమస్ నవల 'షాడో' ఆధారంగా వెబ్ సిరీస్ ని నిర్మించబోతున్నాడని వార్తలు మొదలయ్యాయి.
ఈ వార్తలపై తాజాగా శరత్ మండవ సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా స్పందించారు. తనపై వస్తున్నవార్తలకు క్లారిటి ఇచ్చారు. 'షాడో'పై వార్తలు ఇప్పుడే కొత్త కాదు. చాలా కాలంగా గురువుగారు మంధుబాబు గారితో ఈ విషయమై టచ్ లో వున్నాను. తన నవలని విజువల్ గా మార్చి వెబ్ సిరీస్ గా మలిచే అవకాశాన్ని ఆయన నాకు ఇవ్వడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. దీనిపై మేము గత కొన్ని రోజులుగా వర్క్ చేస్తున్నాం.
అంతా మేము అనుకున్న షేప్ కు రాగానే అధికారికంగా ప్రకటిస్తాం. దీనికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఇలాంటి వి సరైన సమయంలోనే రావాలి' అంటూ 'షాడో' నవలా సిరీస్ పై దర్శకుడు శరత్ మండవ స్పందించారు.
మధుబాబు ఫేమస్ నవల 'షాడో' ఆధారంగా శరత్ మండవ వెబ్ సిరీస్ కు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. మొత్తం 146 నవలలని వెబ్ సిరీస్ గా మలచబోతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారకింగా ప్రకటించే అవకాశం వుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.