వసూళ్లపరంగా వెనకబడిన వైల్డ్ డాగ్.. ఇప్పటివరకు ఎంతంటే??

Update: 2021-04-06 16:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాలన్ని కరోనా ఎఫెక్ట్ కారణంగా దెబ్బతింటున్నాయి. కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్. ఈ సినిమా విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసింది. భారీ అంచనాలతో ఏప్రిల్ 2వ వైల్డ్ డాగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ డే బాగానే కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాకు రెండో రోజు నుండి భారీ దెబ్బపడింది. ఊహించని రేంజిలో కలెక్షన్స్ పడిపోవడం వైల్డ్ డాగ్ బృందాన్ని షాక్కు గురిచేస్తుంది. నిజానికి వైల్డ్ డాగ్ మూవీ మొదటి రోజున రూ.1.21 కోట్లు వసూల్ చేసింది. ఈ చిత్రం రెండో రోజు నుండి వసూళ్లు 50 శాతానికి పడిపోయాయి. రెండో రోజు ఈ సినిమా 64 లక్షలు మాత్రమే రాబట్టింది. అయితే వైల్డ్ డాగ్ పరిస్థితి తెలిసి మెగాస్టార్ కూడా ప్రోత్సాహం అందించేందుకు బరిలోకి దిగాడు.

వైల్డ్ డాగ్ సినిమాకు స్వయంగా రివ్యూను సోమవారం ప్రెస్ మీట్‌లో వదిలాడు. అయినా కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో మెగాస్టార్ ప్లాన్ కూడా విఫలమైందనే చెప్పాలి. ఇంకా నాలుగో రోజు వైల్డ్ డాగ్ కలెక్షన్స్ ఇంకా దారుణంగా నమోదయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. నైజాంలో 8లక్షలు, సీడెడ్‌లో 3లక్షలు, ఉత్తరాంధ్రలో 4లక్షలు, ఈస్ట్ గోదావరిలో 3.2 లక్షలు, వెస్ట్ గోదావరిలో 2 లక్షలు, గుంటూరులో 2.2 లక్షలు, నెల్లూరులో 1.8 లక్షలు వసూళ్లు నమోదయ్యాయి. మొత్తంగా వైల్డ్ డాగ్ నాలుగో రోజు 27 లక్షలు మాత్రమే వసూలు చేసిందట. టోటల్ గా ఇప్పటివరకు వైల్డ్ డాగ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3.10 కోట్లు.. రూ.6 కోట్లు గ్రాస్ నమోదు చేసింది. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ 9.4కోట్లు సెట్ అయింది. ఈ విధమైన కలెక్షన్స్ చూస్తుంటే వైల్డ్ డాగ్ బ్రేక్ ఈవెన్ అనేది కష్టమే అనిపిస్తుంది.
Tags:    

Similar News