'కింగ్' అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''వైల్డ్ డాగ్'' ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అహిషోర్ సాల్మోన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో దియామీర్జా - సయామీ కేర్ - అతుల్ కులకర్ణి - ఆలీ రెజా - ప్రకాష్ సుదర్శన్ - బిలాల్ హుస్సేన్ ఇతర పాత్రలు పోషించారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయబడిన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్ లో 11 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. ఈ క్రమంలో తాజాగా 'వైల్డ్ డాగ్' టీజర్ ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
''1989లో సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని కాపాడటానికి 13 మంది టెర్రరిస్టులను రిలీజ్ చేశారు.. కాందహర్ లో మన ప్లేన్ ని హైజాగ్ చేసినందుకు ముగ్గురు టెర్రరిస్టులను రిలీజ్ చేశారు.. వాళ్లలో ఒకడు మసూద్ అజహర్.. వాడి వల్లే ముంబై టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయి.. అందులో 174 మంది అమాయకపు ప్రజలు చనిపోయారు'' అంటూ ఏసీపీ విజయ్ వర్మ అలియాస్ వైల్డ్ డాగ్ చెప్పుకొచ్చారు. 'కసబ్ కోసం ఒకటిన్నర కోటి ఇంటర్నల్ సెక్యూరిటీ.. 250 మంది స్పెషల్ పోలీసులు కాపలా.. టోటల్ గా 29 కోట్లు.. ఇది కాకుండా బిర్యానీ జెడ్ క్యాటగిరీ సెక్యురిటి.. విఐపీ సర్వీస్.. ఆర్ యూ ఓకే విత్ దట్.. ఐ యామ్ నాట్ ఓకే విత్ దట్' విజయ్ వర్మ ఇంటెన్షన్ ఎలాంటిదో చెప్పే ప్రయత్నం చేశారు.
'ఒకడు మన దేశంలో వందల మందిని చంపి మీరు నన్నేమీ చేయలేరు అంటే ఐ యామ్ నాట్ ఓకే విత్ దట్..' అంటూ 'ఇది చేస్తోంది మన దేశంలో భయంతో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి కోసం' అని నాగ్ చెప్పే డైలాగ్ తో సినిమా నేపథ్యం ఏంటో తెలుస్తోంది. ఈ చిత్రంలో హైదరాబాద్ లో గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ మరియు దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల వెనుకున్న ప్రధాన సూత్రధారులను పట్టుకోడానికి రంగంలోకి దిగిన ఎన్ఐఏ టీమ్ కథను చూపించబోతున్నారు. ఈ చిత్రానికి థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చగా.. షానెల్ డియో సినిమాటోగ్రఫీ అందించారు. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ వర్క్ చేశారు. డేవిడ్ యాక్షన్ డైరెక్టర్ గా.. మురళి ఎస్వీ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.
Full View