మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ''ఆచార్య'' సినిమా భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ మూవీకి తొలి రోజు మిశ్రమ స్పందన లభించింది.
మూడేళ్ల గ్యాప్ తర్వాత బిగ్ బాస్ బిగ్ స్క్రీన్ మీద కనిపించే సినిమా కావడం.. RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ చేసిన మూవీ అవ్వడం.. మెగా తండ్రీకొడుకులు తొలిసారిగా పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రమవడం.. అపజయం ఎరుగని దర్శకుడు రూపొందించే సినిమా కావడంతో మొదటి నుంచీ 'ఆచార్య' పై అందరి దృష్టి ఉంది.
అయితే సినిమా చూసిన తర్వాత మెజారిటీ వర్గం నిరాశ చెందినట్లు తెలుస్తోంది. రివ్యూలు కూడా సినిమా యావరేజ్ అని చెబుతున్నారు. మెగా మూవీ అంచనాలను అందుకోవడంలో విఫలమైందని.. కాలం చెల్లిన కథ కథనాలతో మెప్పించలేకపోయిందని.. 'ఆచార్య' కొరటాల శివ కెరీర్ లో బలహీనమైన వర్క్ అని కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు రిలీజైన అన్ని ఏరియాల్లోనూ ఓపెనింగ్ డే నాడు ''ఆచార్య'' ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఏమంత ఆశాజనకంగా లేవనే చెప్పాలి. హైదరాబాద్ లో టికెట్ రేట్ల పెంపుతో కూడా 4.9 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది.
ఇటీవల కాలంలో హైదరాబాద్ లో పెద్ద సినిమాల తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ గమనిస్తే.. RRR (9.5 కోట్లు) - భీమ్లానాయక్ (6.30 కోట్లు) - రాధేశ్యామ్ (6.21 కోట్లు) - పుష్ప (6.14 కోట్లు) ఉన్నాయి. వీటిల్లో కొన్నింటికి హైక్స్ లేవనే సంగతి తెలిసిందే.
ఇక నైజాంలో 'ఆచార్య' సినిమా మొదటి రోజు సుమారు 7.90 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ప్రపంచవ్వాప్తంగా ఫస్ట్ డే దాదాపు 40 కోట్లు గ్రాస్.. 30 కోట్ల వరకూ షేర్ సాంధించిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ప్రస్తుత ట్రెండ్ చూస్తే బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
'ఆచార్య' చిత్రానికి దాదాపు రూ.133 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 134 కోట్ల వరకు షేర్ రాబట్టాలి. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి రోజు వసూళ్లను బట్టి చూస్తే.. ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో? బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుంటుందా లేదా? అనే చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో మెగా మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.
'ఆచార్య' సినిమాలో చిరంజీవి కి హీరోయిన్ లేదు. రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది. సోనూ సూద్ - జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం సమకూర్చగా.. తిరు సినిమాటోగ్రఫీ అందించారు. కొణిదెల ప్రొడక్షన్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.