కరోనా థర్డ్ వేవ్ పీక్స్ లో కొనసాగుతోంది. వైరస్ ప్రమాదకరంగా లేనప్పటికీ జాగ్రత్తలు తప్పనిసరి. ఇళ్లకే పరిమితమైనా..ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ బారిన పడక తప్పలేదు. అక్కడక్కడా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. థర్డ్ వేవ్ లో టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు కూడా ఎక్కువగా కరోనా బారిన పడ్డారు. ఇటీవలే మహేష్ కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. మెగాస్టార్ చిరంజీవికి కూడా కోవిడ్ సోకింది. ప్రస్తుతం చిరంజీవి హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. తనని కలిసిన వారంతా పరీఓలు చేసుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దీంతో ఆ ఇద్దరు హీరోలు షూటింగ్ లకు దూరంగా ఉన్నారు.
`సర్కారు వారి పాట` షూటింగ్ కొంత బ్యాలెన్స్ ఉంది. మహేష్ కి కోవిడ్ సోకసం సహ అన్నయ్య రమేష్ మరణం కారణంగాను షూటింగ్ కి దూరంగా ఉన్నారు. ఫిబ్రవరి లో కూడా మహేష్ విరామంలోనే ఉంటారని తెలుస్తోంది. మార్చిలేదా ఏప్రిల్ లో తిరిగి సెట్స్ కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారుట. ఇక మెగాస్టార్ చిరంజీవి పరిస్థితి దాదాపు అంతే. `ఆచార్య` షూటింగ్ పూర్తిచేసిన చిరంజీవి `గాడ్ ఫాదర్`.. `భోళా శంకర్` చిత్రాల్ని లైన్ లో పెట్టారు. బాబి చిత్రం క్యూ లో ఉంది. చిరంజీవికి కోవిడ్ సోకడం రెండవసారి. దీంతో ఆయన మరింత జాగ్రత్త వహిస్తున్నారు. థర్డ్ వేవ్ పూర్తయ్యే వరకూ షూటింగ్ లకు దూరంగా ఉండాలని భావిస్తున్నారుట.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రష్యా నుంచి ఇటీవలే తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలపైనే ఆయన దృష్టంతా. `హరి హర వీరమల్లు` షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు? అన్న దానిపై స్పష్టత లేదు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప` రెండవ భాగం షూటింగ్ ఇంకా ప్రారంభించాలేదు. మొదటి భాగం సక్సెస్ ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్ ల వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఇంకా `ఆర్ ఆర్ ఆర్` వాయిదా షాక్ నుంచి బయటకు రాలేదు. చరణ్-శంకర్ మళ్లీ ఎప్పుడు సెట్స్ కు వెళ్తారు? అన్నది క్లారిటీ లేదు. కొరటాల శివతో తారక్ సినిమా చేయాల్సి ఉంది.
కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇక డార్లింగ్ ప్రభాస్ ఇటీవలే ఫారిన్ షెడ్యూల్ పూర్తిచేసి వచ్చాడు. కోవిడ్ తర్వాత జాయిన్ కానున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు నటసింహ బాలకృష్ణ `ఆహా 2.0` ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉన్నారు. చాలా ఉత్సాహంగా ఆ షోని హోస్టింగ్ చేస్తున్నారు. ఆ మూవ్ మెంట్ చూస్తుంటే బాలయ్య ఇప్పట్లో కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కించేలా కనిపించలేదు. అటు మాస్ రాజా రవితేజ కూడా బ్రేక్ తీసుకున్నాడు. మరి వీళ్లంతా మళ్లీ కెమెరా ముందుకు వెళ్లాలంటే మరో రెండు నెలలు సమయం పడుతుందన్నది ఇన్ సైడ్ టాక్.