కామేడీ చిత్రాలతో కొన్నేళ్లపాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్.. ఇప్పుడు తనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ వైవిధ్యమైన చిత్రాలతో వస్తున్నారు. గతేడాది 'నాంది' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” అనే మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ తో రాడానికి రెడీ అయ్యారు.
అల్లరి నరేష్ హీరోగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఇందులో 'జాంబీ రెడ్డి' ఫేమ్ ఆనంది హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిశోర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ ఈరోజు ప్రకటించారు.
'IMP' చిత్రాన్ని ముందుగా నవంబర్ 11న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేసారు. అయితే ఇప్పుడు ఈ మూవీ రెండు వారాలు ఆలస్యంగా 2022 నవంబర్ 25వ తేదీన థియేటర్లలోకి రాబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ ని సోషల్ మీడియాలో వదిలారు.
ఈ రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీలో అల్లరి నరేష్ ఒక ఎలక్షన్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ చరణ్ పాకల సంగీతం సమకూర్చగా.. అబ్బూరి రవి సంభాషణలు రాసారు.
ఇకపోతే అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న మరో సినిమా ''ఉగ్రమ్'' 2023 ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 'నాంది' తర్వాత దర్శక హీరోల కాంబోలో రానున్న ఈ సినిమాపై అందరిలో మంచి అంచనాలున్నాయి.
యాక్షన్ నేపథ్యంలో విభిన్నమైన కథ కథనాలతో 'ఉగ్రమ్' చిత్రం రూపొందుతోంది. ఇందులో నరేష్ సరసన మిర్నా హీరోయిన్ గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి తూమ్ వెంకట్ కథ అందించగా.. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు.
ఒకప్పుడు తనదైన హాస్యంతో అలరించిన అల్లరోడు.. ఇప్పుడు తన పంథా మార్చుకొని బ్యాక్ టూ బ్యాక్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నాడు. కథల ఎంపికలో అచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో 'నాంది' తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన నరేష్.. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' 'ఉగ్రమ్' చిత్రాలతో ఎలాంటి విజయాలు అందుకుంటాడో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.