'అయ్యప్పనుమ్ కోసియుమ్'...ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇది మలయాళంలో రీసెంటుగా విడుదలై ఘన విజయం సాధించిన ఒక సినిమా. ఈ సినిమాలో పృథ్వీరాజ్, బిజూ మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఇతర దక్షిణాది భాషల్లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు చూస్తున్నారు. మన తెలుగు విషయానికి వస్తే ఈ సినిమా రీమేక్ రైట్స్ సితార మరియు హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ సొంతం చేసుకున్నారని సమాచారం. అయితే ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. ఇందులో ఎవరు నటించబోతున్నారు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయ్యప్పనుమ్ పాత్ర కోసం బాలయ్యని సంప్రదించారట. కోసియుమ్ పాత్ర కోసం మంచు విష్ణు, మంచు మనోజ్, రానాలను అనుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా ఏదీ ప్రకటించ లేదు. రానా అయితే పృథ్వీ రాజ్ పోషించిన పాత్రకు సెట్ అవుతాడని సినీ అభిమానులు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అసలు ఈ మలయాళ రీమేక్ తెలుగులో వర్క్ అవుట్ అవుద్దా అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో మొదలైంది.
'అయ్యప్పనుమ్ కోసియుమ్' కథ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఇగో వల్ల, వాళ్ళ జీవితాల్లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఉంటుందట. అయ్యప్పనుమ్ క్యారక్టర్ కి ఫస్ట్ హాఫ్ లో పెద్దగా ప్రాధాన్యం ఉండదని తెలుస్తుంది. సెకండ్ హాఫ్ లో కూడా మూడు నాలుగు మెయిన్ సీన్స్ మాత్రమే ఉంటాయట. మరి అలాంటి పాత్ర బాలయ్య అంగీకరిస్తాడా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. మన నేటివిటీకి మార్చినా ఆ మలయాళ వాసన మనవాళ్లకు నచ్చుతుందో లేదో అనే డౌట్. పృథ్వీరాజ్ బిజూ మీనన్ లు తమ పాత్రలను చాలా చక్కగా పోషించి చిత్ర విజయానికి కారణమయ్యారు. మన టాలీవుడ్ లో ఈ పుకార్లకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో. ఈ చిత్రం ఎవరితో తీస్తారనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.