గతంలో అధికారంలో వున్న పార్టీ చేసే తప్పులని ఎత్తిచూపుతూ దివంగత సూపర్ స్టార్ కృష్ణ పలు సినిమాల్లో సంచలన డైలాగులని సంధించిన విషయం తెలిసిందే. ఈ మధ్య అలాంటి విమర్శనాత్మక సినిమాల ధోరణి తగ్గుతూ వస్తోంది. అయితే కొతం మంది హీరోలు ఇప్పటికీ సూపర్ స్టార్ అందించిన స్ఫూర్తితో అధికార పార్టీలపై తమ సినిమాల్లో పదునైన విమర్శలు చేస్తూ ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తను నటించిన లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్'లో పొలిటికల్ లీడర్లపై పంచ్ లు వేయడం చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఇదే తరహాలో పూర్తి స్థాయిలో ఏపీ అధికార పార్టీని టార్గెట్ చేస్తూ నందమూరి బాలకృష్ణ ఓ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కు శ్రీకారం చుట్టబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వరుస కథనాలు వినిపిస్తున్నాయి. దీనికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నారట. ప్రస్తుతం ఉస్తాద్ రామ్ తో పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుడుతున్న బోయపాటి ఈ మూవీ తరువాత బాలయ్య తో పొలిటికల్ సెటైరికల్ యాక్షన్ మూవీని తెరపైకి తీసుకురానున్నారట.
ఇందులో ఏపీలో అధికారంలో వున్న వైఎస్ జగన్ పై, ఆయన పార్టీ విధానాలపై పదునైన విమర్శలు చేయబోతున్నారట. ఇందు కోసం స్క్రిప్ట్ ని పవర్‌ఫుల్ గా బోయపాటి రెడీ చేయిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీని త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ లేదా 14 ప్లస్ రీల్స్ కానీ నిర్మించనుందట. బోయపాటి ఈ మూవీ కోసం ఏర్పాట్లు చేస్తుంటే గోపీచంద్ మలినేనితో చేస్తున్న వీరసింహారెడ్డి'లోనే ఏపీ రాజకీయాలపై విమర్శనాస్త్రాలని బాలయ్య సంధించబోతున్నారని తెలుస్తోంది.
ఏపీ రాజకీయాలపై బాలయ్య ఈ మూవీలోని ఓ సన్నివేశంలో భారీ పంచ్ లు వేయబోతున్నారని ఇన్ సైడ్ టాక్. 'క్రాక్'తో ట్రాక్ లోకి వచ్చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ మూవీ కోసం సాయి మాధవ్ బుర్రాని డైలాగ్ రైటర్ గా తీసుకున్నారు. ఆయనకు రాజకీయాలపై అవగాహన వుండటం..టైటిల్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా మాటల రచియత సాయి మాధవ్ బుర్రా సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నామని చెప్పిన తీరు సినిమాలో ఏ రేంజ్ లో బాలయ్య చేత డైలాగ్ లు చెప్పించారో స్పష్టమవుతోంది.
టీజర్ లో బాలయ్య చెప్పిన 'భయం నా బయోడేటాలోనే లేదుగా బోషిడికే..' డైలాగ్ ని బట్టి అధికార పార్టీపై ఎలాంటి పంచ్ లు.. ఏ స్థాయి పంచ్ లు వేయబోతున్నారో తెలుస్తోందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. సినిమాలో ఏ రేంజ్ లో డైలాగ్ లు వున్నాయో తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.