బ‌తిమాలితే దారికొచ్చే టైపా భీమ్లా నాయ‌క్?

Update: 2021-11-14 08:44 GMT
ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర వ్య‌వ‌హారం ఇప్ప‌ట్లో ఓ కొలిక్కి వ‌చ్చేట్టు లేదు. ప్ర‌భుత్వం మొండి ప‌ట్టు వీడ‌క‌పోవ‌డంతో కొత్త ధ‌ర‌ల‌పై నిర్మాత‌లు ఆశ‌లు వ‌దులుకున్నారు. ఏపీ మంత్రి పేర్ని నానీతో ప‌లు ద‌ఫాలుగా సాగించిన చ‌ర్చ‌ల‌లో ఆయ‌న నుంచి పాజిటివ్ సంకేతాలు క‌నిపించినా కానీ అంత‌లోనే ప్ర‌తిదీ మారిపోయింది. సాయి తేజ్ రిప‌బ్లిక్ ప్రీరిలీజ్ వేడుక‌లో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ ప్ర‌భుత్వంపై చెల‌రేగ‌డంతో స‌న్నివేశం పూర్తిగా ప‌రిశ్ర‌మ‌కు ఇబ్బందిక‌రంగా మారింది.

అప్ప‌టివ‌ర‌కూ సాగించిన చ‌ర్చ‌లు ఫ‌ల‌వంతం అవుతున్నాయ‌ని సంబ‌ర‌ప‌డిన సినీపెద్ద‌ల‌కు పెద్ద ఝ‌ల‌క్ త‌గిలింది. మ‌రోసారి ఏపీ ప్ర‌భుత్వం ఇండ‌స్ట్రీపై భీష్మించుకునేలా చేసింది ఆ ఘ‌ట‌న అన్న విమ‌ర్శ‌లొచ్చాయి. కానీ ఆ త‌ర్వాత కూడా సినీపెద్ద‌లు త‌మ ప్ర‌య‌త్నం మానలేదు. హైద‌రాబాద్ విజ‌య‌వాడ‌లో ప‌లు మార్లు ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల‌తో సినీపెద్దలు భేటీ అయ్యి టిక్కెట్ల ధ‌రల‌ అంశం పై చ‌ర్చించారు. ప్ర‌భుత్వ పోర్ట‌ల్ న‌డిపించుకోవ‌డానికి అభ్యంత‌రం లేద‌ని చెప్పిన సినీపెద్ద‌లు టిక్కెట్టు ధ‌ర‌ల పెంపుపై ఆలోచించాల‌ని కోర‌గా మెత్త‌బ‌డ్డార‌ని దీనిపై త్వ‌ర‌లో నిర్ణ‌యం వెలువ‌డుతుంద‌ని భావించారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై క్లారిటీ లేదు.

అయితే ప్ర‌భుత్వ పెద్ద‌లు సానుకూలంగా ఉన్నార‌ని టిక్కెట్టు ధ‌ర‌లు పెరుగుతాయ‌ని నిర్మాత‌ల్లో ఒక సెక్ష‌న్ భావిస్తోంది. కొన్నాళ్ల పాటు ప‌వ‌న్ సైలెంటు గా ఉంటే అన్నీ ప‌రిష్కారం అవుతాయ‌ని భావిస్తున్నారు. అంతేకాదు ప‌వ‌న్ న‌టించిన భీమ్లా నాయ‌క్ తోనే అస‌లు స‌మ‌స్య‌. వ‌కీల్ సాబ్ సీన్ ని మ‌రోసారి ప్ర‌భుత్వం అక‌స్మాత్తుగా రిపీట్ చేస్తే ఏమ‌వుతుందోన‌నే ఆందోళ‌న అంద‌రిలో ఉంది. అందుకే ఇప్పుడు సంక్రాంతికి రానున్న సినిమాల విష‌యంలో నిర్మాత‌ల్లో గుబులు గా ఉంది. ఇక‌పోతే ఈ డిసెంబ‌ర్ లోనే టిక్కెట్టు రేట్ల పెంపుపై క్లారిటీ వ‌చ్చేస్తుంద‌ని కొంద‌రు చెబుతున్నారు. ఒక‌వేళ ఇప్పుడే కుద‌ర‌క‌పోయినా కానీ సంక్రాంతి సినిమాల‌కు లైన్ క్లియ‌ర‌య్యే సూచ‌న‌లు ఉన్నాయ‌ని భావిస్తున్నారు. అయితే భీమ్లా నాయ‌క్ సంక్రాంతి బ‌రిలో ఉండ‌డం కొంత ఇబ్బందిక‌ర‌మ‌ని ఆ సినిమాని వేస‌వికి వాయిదా వేసుకుంటే ప‌రిష్కారం దొరుకుతుంద‌ని నిర్మాత నాగ‌వంశీని ఇత‌రులు కోరుతున్నార‌ట‌. ఏపీలో వైసీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన వ్య‌వ‌హారం ముదురుతున్న క్ర‌మంలో ఏం జ‌రుగుతుందోన‌న్న ఆందోళ‌న ఇత‌ర నిర్మాత‌ల్లో ఉంది. అయితే ఎట్టి ప‌రిస్థితుల్లో సంక్రాంతి బ‌రిలోనే రిలీజ్ కి దిగుతామ‌ని నిర్మాత నాగ‌వంశీ ఇంత‌కుముందే ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. కానీ ఆయ‌న‌ను బ‌తిమాలుకుంటే భీమ్లా నాయ‌క్ రిలీజ్ ని వాయిదా వేయిస్తే.. ఇత‌రుల‌కు లైన్ క్లియ‌ర‌వుతుంద‌ని భావిస్తున్నారు. మ‌రోవైపు పుష్ప రిలీజ్ ముందే టిక్కెట్టు ధ‌ర‌ల‌పై ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యం వెలువ‌డుతుంద‌ని సుక్కూ అండ్ టీమ్ ఎదురు చూస్తోంది. డిసెంబ‌ర్ 17లోపే క్లియ‌రైతే బావుంటుంద‌ని ఒక హోప్. కానీ ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News