'వలిమై' కోసం 'భీమ్లా నాయక్' ని వాయిదా వేస్తారా..?

Update: 2022-02-12 11:32 GMT
2022 మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ సినిమాల్లో ''భీమ్లా నాయక్'' ఒకటి. ఇందులో పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాని ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు పవన్ సినిమాకి మరో తేదీని పరిశీలిస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతిచ్చి నైట్ కర్ఫ్యూ ఎప్పుడు ఎత్తేస్తే అప్పుడు 'భీమ్లా నాయక్' సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాత ఇటీవల తెలిపారు. అలానే తెలుగుతో పాటు హిందీలోనూ సేమ్ డేట్ కే రిలీజ్ చేస్తామని హింట్ ఇచ్చారు. ఏపీలో మరో పది రోజుల్లో సినిమా టికెట్ రేట్లకు సంబంధించిన అధికారిక జీవో వచ్చే అవకాశం ఉండటంతో.. ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ వస్తుందని టాక్ వచ్చింది.

అయితే అదే రోజున 'గంగూబాయి' 'ఆడవాళ్లు మీకు జోహార్లు' 'గని' 'స్టెబాస్టియన్' వంటి సినిమాలను ప్లాన్ చేసుకున్నారు. అలానే అజిత్ కుమార్ నటించిన 'వలిమై' సినిమా ఒక్కరోజు ముందుగా.. అంటే ఫిబ్రవరి 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమాకు సంబంధించిన నాలుగు ఏరియాల రైట్స్ ను 'భీమ్లా నాయక్' ప్రొడ్యూసర్స్ తీసుకున్నారని  ఫిల్మ్ నగర్‌ లో టాక్ నడుస్తోంది.

అంతేకాదు 'వలిమై' డీల్ కారణంగా ఇప్పుడు 'భీమ్లా నాయక్' చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయడం లేదని.. అలా అని ఏప్రిల్ 1న కూడా రిలీజ్ చేసే అవకాశం లేదని పుకార్లు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 8న భారీ స్థాయిలో విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే సినిమా రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇకపోతే 'భీమ్లా నాయక్' సినిమా పెండింగ్ షూటింగ్ ని శరవేగంగా జరుపుతున్నారు. హైదరాబాద్ లోని రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో పవన్ కళ్యాణ్ పాల్గొనే సీన్స్ ని చిత్రీకరిస్తున్నారని సమాచారం. వీలైనంత త్వరగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసి సినిమాని రెడీ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ కూడా ముమ్మరం చేయనున్నారు.

కాగా, ''భీమ్లా నాయక్'' సినిమా మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్.. రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
    
    
    

Tags:    

Similar News