త్వరలో ఆ క్రేజీ కాంబో నుండి 'గుడ్ న్యూస్' రానుందా..??

Update: 2021-01-08 02:30 GMT
టాలీవుడ్ మాస్ హీరోలలో ఒకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి రెండో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అలాగే వీరి క్రేజీ కాంబినేషన్ కోసం నందమూరి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. 2018లో విడుదలైన 'అరవింద సమేత' సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయనున్నట్లు ముందే ప్రకటించారు. హారిక అండ్ హాసిని బ్యానర్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందట. ప్రస్తుతం ఎన్టీఆర్.. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ పాన్ ఇండియా సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించనున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ పూర్తైయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం లేకుండా త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్.

ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రాజకీయ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పై త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. పర్ఫెక్ట్ ఫ్యామిలీ పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా రానుందని టాక్. అంతేగాక ఇటీవల న్యూ ఇయర్ సందర్బంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి తమ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు. త్వరలో షూటింగ్ ప్రారంభం చేస్తామని తెలిపారు. కానీ ఎప్పుడు మొదలు అవుతుంది అనేది మాత్రం త్వరలో తెలియనుంది. ఇక క్లాస్ డైరెక్టర్ గా ఫేమస్ అయిన త్రివిక్రమ్, మాస్ హీరో అయిన ఎన్టీఆర్ మరోసారి కలిస్తే భీభత్సం జరుగుతుందని ఇదివరకు నిరూపించారు. మరి ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ లుక్, బాడీ లాంగ్వేజ్ వెరైటీగా ఉండబోతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఈ కాంబో ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందో..!!


Tags:    

Similar News