సంక్రాంతి సినిమాలతో ఆయన మళ్లీ పుంజుకుంటాడా?

Update: 2023-01-09 14:30 GMT
టాలీవుడ్‌ ప్రేక్షకులను దాదాపు రెండు దశాబ్దాలుగా తన విలక్షణ నటనతో అలరిస్తున్న ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాలంలో ఫామ్ కోల్పోయాడు అనిపిస్తుంది. ఆయన నటనను అభిమానించే వారిని సంతృప్తి పరిచే విధంగా ఈ మధ్య కాలంలో ఏ ఒక్క సినిమాను చేయలేదు. పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ నటన గురించి జనాలు ఇప్పటికి కూడా మాట్లాడుకుంటున్నారు.

ఒక్కడు.. ఇడియట్‌.. బొమ్మరిల్లు లోని ప్రకాష్ రాజ్ పాత్ర గురించి ఇప్పటికి కూడా జనాలు సోషల్‌ మీడియా ద్వారా చర్చించుకోవడం చూడవచ్చు. అద్భుతమైన విలనిజం చూపించిన పాత్రల్లో మరియు సాఫ్ట్‌ పాత్రల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్న ప్రకాష్ రాజ్ ప్రస్తుతం ఆఫర్ల విషయంలో వెనక పడ్డట్లుగా అనిపిస్తుంది.

టాలీవుడ్‌ లోని దాదాపు అందరు సీనియర్ మరియు జూనియర్‌ స్టార్‌ హీరోలతో సినిమాల్లో నటించిన ప్రకాష్ రాజ్ ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మరియు వారసుడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రెండు సంక్రాంతి సినిమాల్లో కూడా ప్రకాష్ రాజ్ విలన్‌ రోల్స్ అన్నట్లుగా సమాచారం అందుతోంది.

తాజాగా విడుదల అయిన సంక్రాంతి సినిమాల యొక్క ట్రైలర్స్ లో ప్రకాష్ రాజ్ లుక్ తో పాటు పాత్రలను రివీల్ చేయడం జరిగింది. ఆ రెండు సినిమాలు సక్సెస్ అయితే కచ్చితంగా ప్రకాష్‌ రాజ్ ఇంతకు ముందు మాదిరిగా వరుసగా స్టార్‌ హీరోల సినిమాల్లో చాన్స్ లు దక్కించుకునే అవకాశం ఉంది.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ నుండి విలన్స్ ను దిగుమతి చేసుకుంటున్నారు కానీ వారిలో ఎక్కువ శాతం నిరాశ పర్చుతున్నారు. అందుకే ప్రకాష్ రాజ్‌ మళ్లీ టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ విలన్ గా నిలిచే అవకాశాలు లేకపోలేదు అంటూ అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ విషయంలో ఫిల్మ్‌ మేకర్స్ కూడా పాజిటివ్ గా ఉన్నారని టాక్ వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News