ప్రముఖ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సహాయ దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి, రచయితగా పలు సినిమాలకు పని చేసిన ఈయన.. 'జిల్' మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ వారు నిర్మించారు. 2015లో రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఆ తర్వాత రాధాకృష్ణ కుమార్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేసే అద్భుత అవకాశాన్ని అందుకున్నాడు. కానీ, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'రాధేశ్యామ్'. యూవి క్రియేషన్స్ బ్యానర్‌పై హై బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో నిర్మితమైన ఈ వింటేజ్ లవ్ స్టోరీ మార్చిలో విడుదలై.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయింది.
లాంగ్ రన్ లో సగం టార్గెట్ ను కూడా అందుకోలేకపోయిన ఈ మూవీ.. బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ మూవీ ఫ్లాప్ తర్వాత రాధాకృష్ణ ఎక్కడా కనిపించలేదు. కనీసం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే తాజాగా ఆయన తదుపరి చిత్రంపై ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
అదేంటంటే.. రాధాకృష్ణ తన మూడో చిత్రాన్ని గోపీచంద్ తోనే చేయాలని భావిస్తున్నాడట. ఇప్పటికే ఓ స్టోరీ లైన్ ను తయారు చేసి.. గోపీచంద్ కు వినిపించారట. అది విన్న ఆయన పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారని.. కానీ, సినిమాకు సైన్ చేయడానికి కాస్త టైమ్ కావాలని గోపీచంద్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది.
మరి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న రాధాకృష్ణకు గోపీచంద్ మరోసారి అవకాశం ఇస్తారా.. లేదా.. అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఈ ప్రాజెక్ట్ ను కూడా యూవి క్రియేషన్స్ వారే నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్ నడుస్తోంది.
కాగా, ప్రస్తుతం గోపీచంద్ 'పక్కా కమర్షియల్' మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 1న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా అనంతరం గోపీచంద్ తనకు డబుల్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ తో హ్యాట్రిక్ మూవీ చేయబోతున్నాడు. గోపీచంద్ కెరీర్‌లో ఇది 30వ సినిమా కాగా.. దీనిని పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.