టాలీవుడ్ లో జాతీయ క్రీడ హాకీ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఫస్ట్ సినిమా ''ఏ1 ఎక్స్ ప్రెస్''. యంగ్ హీరో సందీప్ కిషన్ - లావణ్య త్రిపాఠి హాకీ క్రీడాకారులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్ కి డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ - వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ - సందీప్ కిషన్ - దయా పన్నెం కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిప్ హాప్ తమిజ ఈ చిత్రానికి మ్యూజిక్ సమకూరుస్తుండగా.. కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతానికి విడుదలైన పబ్లిసిటీ కంటెంట్ లో ట్రైలర్ మరియు 'సింగిల్ కింగులం' సాంగ్ ఆడియెన్స్ అటెన్షన్ గెయిన్ చేశాయి.
తెలుగు ఇండస్ట్రీలో స్పోర్ట్స్ డ్రామాలకి క్రిటికల్ ఎప్లాజ్ దొరుకుతుంది కానీ.. కమర్షియల్ ఎప్లాజ్ దొరకడం చాలా కష్టమనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. ఈ పాయింట్ ని లెక్కలోకి తీసుకుంటే మాత్రం సందీప్ కిషన్ తన 25వ సినిమాతో కాస్త రిస్క్ చేస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంచి ఓపెనింగ్స్ రావాలంటే మాస్ ఆడియెన్స్ కి రీచ్ అయ్యే దారిని ఈ రెండు రోజుల్లో సందీప్ వెతకాల్సి ఉంటుంది. అయితే తెలుగులో హాకీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మొదటి సినిమా కావడం.. దీనికి క్లీన్ 'యూ' సెన్సార్ సర్టిఫికేట్ దక్కడం కలిసొచ్చే అంశాలని చెప్పాలి. మరి సిల్వర్ జూబ్లీ మూవీతో సందీప్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.