దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫిక్షన్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఓటీటీలోనూ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది.
నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబడిన తర్వాత RRR కు గ్లోబల్ ప్రశంసలు దక్కాయి. అనేకమంది హాలీవుడ్ ప్రముఖులు ఈ మాగ్నమ్ ఓపస్ ను కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. రాజమౌళి పనితనాన్ని మెచ్చుకుంటున్నారు. అయితే హాలీవుడ్ మాత్రమే కాదు.. కొరియన్ ఫిలిం మేకర్స్ దృష్టి కూడా ఈ సినిమాపై పడిందని తెలుస్తోంది.
గత రెండు రోజులుగా 'ఆర్.ఆర్.ఆర్' కొరియన్ రీమేక్ గురించి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గురు ఫిల్మ్స్ కి చెందిన నిర్మాత సునీత తాటి రీసెంట్ గా 'శాకిని డాకిని' ప్రెస్ మీట్ లో ట్రిపుల్ ఆర్ గురించి చెప్పిన ఆసక్తికరమైన విషయాలే ఇప్పుడు రీమేక్ పై చర్చలు జరగడానికి కారణమయ్యాయి.
'ఆర్.ఆర్.ఆర్' సినిమా రీమేక్ రైట్స్ కావాలని కొందరు కొరియన్ ఫిల్మ్ మేకర్స్ తనకు ఫోన్ చేసి అడిగారని సునీత తెలిపింది. ఈ విషయాన్ని మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళికి కూడా తెలియజేసినట్లు వెల్లడించింది. అయితే దీనికి రాజమౌళి స్పందన ఏంటనేది సునీత బయట పెట్టలేదు.
అయినప్పటికీ ఇప్పుడు RRR రీమేక్ అనేది నెట్టింట చర్చనీయాంశంగా మారింది. దర్శకుడు రాజమౌళి రీమేక్ కు అనుమతిస్తారా లేదా అని అందరూ ఆలోచిస్తున్నారు. రీమేక్ చేస్తే మాత్రం దక్షిణ కొరియా బాక్సాఫీస్ షేక్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం కొరియాలో ఈ సినిమా వర్కవుట్ కాదని.. ఎందుకంటే ఎస్ఎస్ రాజమౌళి మాత్రమే అలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేయగలరని అంటున్నారు.
కాగా, DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో రామరాజుగా రామ్ చరణ్.. భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. అలియా భట్ - అజయ్ దేవగన్ - సముద్రఖని - ఒలివియా మోరిస్ - శ్రియా శరణ్ - రాహుల్ రామకృష్ణ ఇతరులు ఇతర పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు.
ఇకపోతే RRR కు అంతర్జాతీయ ప్రశంసలు దక్కిన తర్వాత ఈ సినిమా వచ్చే ఏడాది ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పలు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంటుందని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.