రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీ 'లైగర్'. వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించారు. ఈ మూవీ కోసం హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి దాదాపు మూడేళ్లు శ్రమించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడం ఈ ఇద్దరికి చాలా అవసరం. 'ఇస్మార్ట్ శంకర్'తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన పూరి ఈ మూవీతో బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. ఇక 'వరల్డ్ ఫేమస్ లవర్' తో డిజాస్టర్ ని దక్కించుకుని షాక్ కు గురైన విజయ్ దేవరకొండ ఈ సారి 'లైగర్'తో దిమ్మదిరిగే బ్లాక్ బస్టర్ ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు.
ఈ ఇద్దరు కలిసి తొలి సారి పని చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే వున్నాయి. తెలుగుతో పాటు ఈ మూవీని హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఈ సినిమా భవితవ్యం తేలబోతోంది. ఆగస్టు 25న ఈ మూవీ భారీ స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే ఈ మూవీని బాయ్ కాట్ ఫీవర్ వెంటాడుతోంది.
కరణ్ జోహార్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం, అనన్య పాండే హీరోయిన్ గా నటించిన కారణంగా ఈ మూవీని బాయ్ కాట్ చేయాల్సిందే అంటూ నెట్టింట #BoycottLigerMovie అంటూ హ్యాష్ ట్యాగ్ ని కొంత మంది యాంటీ ఫ్యాన్స్ వైరల్ గా రన్ చేస్తున్నారు. ఈ ప్రచారానికి ధీటుగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ #UnstoppableLIGER, #iSupportLIGER అంటూ ట్రెండ్ చేస్తూ హేటర్స్ కి గట్టి సమాధానం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి ఉత్తరాదిలో నెగిటివిటీ భారీ స్థాయిలో స్ప్రెడ్ అవుతూ వస్తోంది.
ఇది ఆగస్టు 25న విడుదల కానున్న ఈ మూవీ ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం వుందని ట్రేడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన అమీర్ ఖాన్ మూవీ 'లాల్ సింగ్ చడ్డా'కు బాయ్ కాట్ ప్రచారం తీవ్ర ప్రభావాన్ని చూపి ఓపెనింగ్స్ విషయంలో ప్రతి కూలంగా మారింది. ఇదే పరిస్థితి 'లైగర్'కు తలెత్తితే ఓపెనింగ్స్ చాలా దారుణంగా వుండే అవకాశం వుందని చెబుతున్నారు. ఇదిలా వుంటే 'లైగర్' మూవీపై ఎంత నెగటివిటీ స్ప్రెడ్ అవుతోందో అంత పాజిటివిటీ కూడా స్ప్రెడ్ అవుతోంది.
ఫ్యాన్స్ #UnstoppableLIGER, #iSupportLIGER అంటూ ట్రెండ్ చేస్తూ హేటర్స్ కి గట్టి సమాధానం చెబుతున్నారు. మౌత్ టాక్ కూడా భారీ స్థాయిలో స్ప్రెడ్ అయితే గనక ఈ మూవీ ఉత్తరాది మార్కెట్ లో మరో 'కార్తికేయ 2'గా మారడం ఖాయం అని తెలుస్తోంది.
అదే నిజమైతే ఆ ఫీట్ ని 'లైగర్' రిపీట్ చేయడం గ్యారంటీ అనే కామెంట్ లు కూడా వినిపిస్తున్నాయి. నిఖిల్ హీరోగా నటించిన 'కార్తికేయ 2' కేవలం మౌత్ టాక్ తో ఉత్తరాది మార్కెట్ ని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అదే ఫీట్ ని మౌత్ టాక్ తో 'లైగర్' కూడా రిపీట్ చేసి బాలీవుడ్ ని షేక్ చేసే మరో సౌత్ సినిమా అవుతుందా? అన్నది తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.