ఫ్యాన్స్ కోరిక ప్ర‌కారం ల‌వ్ బాయ్ రీఎంట్రీ ఇస్తాడా?

Update: 2022-10-12 10:30 GMT
ప్రేమ‌క‌థా చిత్రాల‌తో ల‌వ్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న త‌రుణ్ ని ఫ్యాన్స్ మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాల‌ని కోరుతున్నారా?.. అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. బాల న‌టుడిగా కెరీర్ ప్రారంభించిన తరుణ్ 'నువ్వే కావాలి' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన విష‌యం తెలిసిందే. ఉత్త‌మ బాల‌న‌టుడిగా, హీరోగా మంచి పేరు తెచ్చుకున్న త‌రుణ్ ప్రేమ క‌థా చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచి ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.

2018 నుంచి కంప్లీట్ గా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్నారు. చివ‌ర్లో చేసిన 'ఇది నా ల‌వ్ స్టోరీ' ఫ్లాప్ కావ‌డంతో అప్ప‌టి నుంచి త‌రుణ్ సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్నారు. అయితే రీసెంట్ గా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో స్ర‌వంతీ మూవీస్ అధినేత స్ర‌వంతి ర‌వికిషోర్‌.. త‌రుణ్ హీరోగా నిర్మించిన‌ 'నువ్వే నువ్వే' 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా చిత్ర బృందం హైద‌రాబాద్ లోని గ‌చ్చిబౌలిలో వున్న ఏఎంబీ సినిమాస్ లో ఈ మూవీని ప్ర‌త్యేకంగా మీడియాకు ప్ర‌ద‌ర్శించారు.

అనంత‌రం సినిమా కార్య‌రూపం దాల్చిన ప‌లు వివ‌రాల్ని పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా త్రివిక్ర‌మ్ ఆనాటి జ్ఞాప‌కాల్ని గుర్తు చేస్తూ ద‌ర్శ‌కుడిగా త‌న‌కు తొలి అవ‌కాశాన్నిచ్చిన ర‌వి కిషోర్ పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ శ్రియ‌తో పాటు ఈ కార్య‌క్ర‌మంలో హీరో త‌రుణ్ కూడా పాల్గొని ఆనాటి జ్ఞాప‌కాల్ని గుర్తు చేసుకున్నారు. అంతే కాకుండా త‌రుణ్ త‌న‌ని ఇప్ప‌టికీ 'నువ్వే నువ్వే' లాంటి సినిమా చేయ‌మ‌ని అభిమానులు, ప్రేక్ష‌కులు అడుగుతున్నార‌ని చెప్పుకొచ్చారు.    

నాకు బోర్ కొట్టిన ప్ర‌తీ సారి యూట్యూబ్ లో ఈ సినిమా చూస్తాన‌ని, నువ్వే కావాలితో న‌న్ను రామోజీ రావు, స్ర‌వంతి ర‌వికిషోర్ హీరోగా ప‌రిచ‌యం చేశార‌ని, ఆ త‌రువాత స్ర‌వంతి మూవీస్ లో మూడు సినిమాలు చేయ‌డం నా అదృష్టం అని, త్రివిక్ర‌మ్ ఎంత మంది హీరోల‌తో సినిమాలు చేసినా ఆయ‌న ఫ‌స్ట్ హీరో నేనే అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న త‌రుణ్ ఇప్ప‌టికీ అదే లుక్ ని మెయిన్‌టైన్ చేస్తుండ‌టం ఆయ‌న అభిమానుల‌తో పాటు నెటిజ‌న్ ల‌ని షాక్ కు గురిచేస్తోంది.

తాజాగా త‌రుణ్ పాల్గొన్న 'నువ్వే నువ్వే' ఈవెంట్ కి సంబంధించిన‌ ఫొటోలు నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో నెటిజ‌న్ లు, అభిమానులు త‌రుణ్ మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాల‌ని బ‌లంగా కోరుకుంటున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌రుణ్ ఫొటోల‌ని షేర్ చేస్తూ ఇదే విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నారు.

ఇప్ప‌టికీ త‌రుణ్ అదే చ‌రిష్మాతో క‌నిపిస్తుండ‌టంతో టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్‌, డైరెక్ట‌ర్ ఇప్ప‌టికైనా త‌రుణ్ టాలెంట్ ని గుర్తించి అందుకు త‌గ్గ క‌థ‌ల‌తో అత‌న్ని సంప్ర‌దించాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మ‌రి త‌రుణ్ ఫ్యాన్స్ కోరిక‌ని మ‌న్నించి మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడా? అన్న‌ది వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News