విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం `విక్రమ్` ఇటీవలే విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కమల్ హాసన్ నటనకు అభిమానులు జేజేలు పలికారు. విజయ్ సేతుపతి- ఫహద్ ఫాజిల్ తమ ఉత్తమ ప్రదర్శనలను ఇచ్చారని పొగడ్తలు అందుకున్నారు. సెలబ్రిటీలు సామాన్యులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కమల్ ప్రతిభను కొనియాడారు.
ఇప్పుడు మహేష్ వంతు వచ్చింది. విక్రమ్ సినిమాని కమల్ నటనను ఈ మూవీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ని మహేష్ ఒక రేంజులో పొగిడేసారు. ఈ చిత్రాన్ని ``న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్`` అని అభివర్ణించారు. దర్శకనిర్మాతలతో ఏదో ఒక రోజు ఈ మూవీ చిత్రీకరించిన మొత్తం ప్రక్రియ గురించి చర్చించాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
అయితే దీనికి మహేష్ అభిమానులు సంతృప్తిగా లేరు. విక్రమ్ లాంటి కల్ట్ క్లాసిక్ లో మహేష్ నటించాలని ఫ్యాన్స్ వరుస ట్వీట్లు చేసారు.
మహేష్ ట్వీట్ లోని వ్యాఖ్యల విభాగంలో అతన్ని ట్రోల్ చేసారు. మహేష్ అలాంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చేయరని.. సామాజిక సందేశాలతో కూడిన అవే రొటీన్ చిత్రాలపై మాత్రమే దృష్టి సారిస్తానని అపహాస్యం చేశారు.
మహేష్ వరుస ట్వీట్లను పరిశీలిస్తే అతడు విక్రమ్ మూవీ చూశాక ఎంతగా ఎమోషనల్ అయ్యారో అర్థమవుతుంది. ఆయన ట్వీట్లు ఇలా ఉన్నాయి. #విక్రమ్... బ్లాక్ బస్టర్ సినిమా!! ఒక కొత్త-యుగం కల్ట్ క్లాసిక్!! డైరెక్టర్ లోకేష్.. మిమ్మల్ని కలుసుకోవడానికి .. విక్రమ్ మొత్తం ప్రక్రియ గురించి చర్చించడానికి ఇష్టపడతాను! మైండ్ బెండింగ్...సెన్సేషనల్ స్టఫ్ బ్రదర్!! అంటూ క్లాప్స్ ని కొట్టిన ఈమోజీలను మహేష్ షేర్ చేసారు.
అబ్బురపరిచే నట ప్రదర్శనలు అంటూ విజయ్ సేతు ఆఫ్ల్.. #ఫహద్ ఫాసిల్ నటన ఇంతకంటే బాగుండదు! అని అన్నారు. వావ్! అనిరుధ్ ఎంత అద్భుతమైన మ్యూజికల్ స్కోర్! మీ కెరీర్ బెస్ట్! ఇది చాలా కాలం పాటు నా ప్లే జాబితాలో అగ్రస్థానంలో ఉండబోతోంది.. అని అన్నారు.
కమల్ హాసన్ నటన గురించి వ్యాఖ్యానించేంత అర్హత లేదు. నేను చెప్పగలను ఒక్కటే.. మీకు పెద్ద అభిమానిగా ఇది నా గర్వకారణమైన క్షణాలలో ఒకటి!! సర్ మీకు మీ అద్భుతమైన బృందానికి అభినందనలు అని మహేష్ ఎంతో ఎగ్జయిట్ అవుతూ వ్యాఖ్యానించారు.
అన్నట్టు అభిమానుల కోరిక మేరకు విక్రమ్ లాంటి యాక్షన్ థ్రిల్లర్ లో మహేష్ ఎందుకు నటించరో చెప్పాలి. లోకేష్ కనగరాజ్ ని కలిసి అలాంటి కథ గురించి అడుగుతారా లేదా? అన్నది వేచి చూడాలి.
నిజానికి ఇంతకుముందు అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా వినిపించిన `యానిమల్` (రణబీర్ చేస్తున్నారు) స్టోరీ కానీ.. సుకుమార్ వినిపించిన పుష్ప (బన్ని ఇప్పటికే బ్లాక్ బస్టర్ కొట్టారు) స్టోరీ కానీ మహేష్ ని పూర్తి డిఫరెంటుగా ఆవిష్కరించేందుకు దర్శకుల విలక్షణ ఎంపికలు. కానీ వాటిని మహేష్ తిరస్కరించారు. తనను అభిమానులు అలా చూడరన్నది అతడి అభిప్రాయం. కానీ ఇప్పుడు అభిమానులు యానిమల్ - పుష్ప లాంటివే కోరుకుంటున్నారు. మహేష్ విక్రమ్ లాంటి కల్ట్ క్లాసిక్ లో నటించాలని కోరుకోవడానికి కారణం అతడిని ఎప్పుడూ రొటీన్ గా చూడడం ఇష్టం లేకనే. నటుడిగా మహేష్ ఏ జోనర్ కి అయినా సూటవుతాడని నిరూపించాల్సి ఉంది.
మహేష్ తదుపరి రాజమౌళితో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయితే కానీ అతడు ఏ సినిమా చేస్తారు? అన్నదానిపై స్పష్ఠత రాదు. లోకేష్ కనగరాజ్- ప్రశాంత్ నీల్- సందీప్ రెడ్డి వంగా- సుకుమార్ లతో భవిష్యత్ లో మహేష్ ప్రయోగాలు చేస్తారనే ఆశిద్దాం.