మెగాస్టార్ కరోనా డేస్ తర్వాత కూడా ఇలానే ఉంటాడా...?

Update: 2020-04-12 01:30 GMT
టాలీవుడ్ మెగాస్టార్.. చిరంజీవి రీసెంటుగా సోషల్ మీడియాలో ఎంటర్ అయిన విషయం తెలిసిందే. మనిషి రోజువారీ జీవితంలో సోషల్ మీడియా భాగమైపోయిన నేపథ్యంలో చిరు కూడా అడుగుపెట్టేసాడు. టీవీలో వచ్చే వార్తల కంటే సోషల్ మీడియాలో వార్తలు చాలా ఫాస్ట్ గా రావడంతో చాలా వరకు మనుషులు సోషల్ మీడియాకి అలవాటు పడిపోయారు. అంతేకాకుండా వాస్తవ ప్రపంచంలో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రజలు గడుపుతున్నారు. ఇతర సెలబ్రిటీలు అయితే ప్రతి ఒక్కరూ తమకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. లేట్ అయినా కూడా లేటెస్టుగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ట్వీట్లతో ట్విట్టర్ హోరెత్తించారు. ఈయన ట్విట్టర్‌లోకి వచ్చినపుడు ఆ ఏం చేస్తాడులే.. అప్పుడప్పుడూ ట్వీట్స్ చేస్తాడనుకున్నారంతా. కానీ ఇప్పుడు చిరంజీవి జోరు చూసి అంతా షాక్ అవుతున్నారు. సోషల్ మీడియా అంతా చిరు జోష్‌కు షేక్ అవుతోంది.

లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఖాళీగా ఉండటంతో చిరు అస్సలు ఆగడం లేదు. రోజుకు సుమారు 10 ట్వీట్స్ చేస్తూ రచ్చ చేస్తున్నాడు. ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరిని ట్విట్టర్ నుంచే పలకరిస్తున్నాడు. ఎవరైనా బర్త్ డేలు ఉంటే ఇంట్లోనే కూర్చుని సోషల్ మీడియాలో అందరితోనూ మాట్లాడుతున్నాడు. ఫ్యాన్స్ కి తన పర్సనల్ విషయాలు చెబుతున్నాడు. ఉగాది శుభాకాంక్షలు మొదలుకొని హనుమాన్ జయంతి రోజు తనకు లాటరీలో వచ్చిన హనుమాన్ పఠం గురించి.. అలాగే బాపు తనకోసం గీసిన బొమ్మ గురించి చెప్పాడు. అంతేకాదు అల్లు అర్జున్, అఖిల్, అకీరాకు బర్త్ డే విషెస్ చెప్పాడు. వాళ్లను పెద్దదిక్కుగా ఆశీర్వదించాడు. కింగ్ నాగార్జునతో కలిసి సాంగ్ లో నటించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి మోడీచే ప్రశంసలు పొందాడు. కరోనా క్రైసిస్ ఛారిటీ అప్డేట్ ఇచ్చేస్తున్నాడు. ఇలా సోషల్ మీడియా నుంచి ఎన్నెన్ని చేయాలో అన్నీ చేస్తున్నాడు చిరంజీవి. మెగాస్టార్ సోషల్ మీడియా వాడకం మీద మీమ్స్ క్రియేటర్స్... మీమ్స్ క్రియేట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు మెగాస్టార్ సోషల్ మీడియా వాడకం.

అయితే సోషల్ మీడియాలో చిరు ధోరణిని విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇన్స్టాగ్రామ్ తో పాటు ట్విట్టర్ లో కూడా ఒకేసారి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి స్టేజ్ పై మైక్ పట్టుకుంటే ఎలా సుదీర్ఘంగా మాట్లాడతారో ట్విట్టర్ లో కూడా అదే ధోరణి కనబరుస్తున్నారు. చిరంజీవి ఇలాగే కొనసాగిస్తే మాత్రం ఫాలో అయిన వాళ్ళు కూడా ఆయన్ని మ్యూట్ లో పెట్టేస్తారు. కానీ ఇప్పుడు లాక్ డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఖాళీగా ఉన్న మెగాస్టార్ క‌రోనా డేస్ అయిపోయాక కూడా ట్విట్ట‌ర్ లో ఇంత యాక్టివ్ గా ఉంటారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దానికి ఉండకపోవచ్చు అనే చెప్పొచ్చు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత షూటింగ్స్ తో బిజీగా ఉండే మెగాస్టార్ కి అంత టైం ఉండదు. అయినా ఇప్ప‌టికైతే ఇది ఓకే కానీ ఆ త‌రువాత కూడా చిరంజీవి ఇదే టైప్ లో ఉంటే మాత్రం ఫ్యాన్స్ కి బోర్ కొట్టేస్తుంది. ఫస్ట్ ఆయన్ని వాళ్లే మ్యూట్ లో పెట్టే అవకాశం ఉంది. మిగ‌తా స్టార్స్ మాదిరిగా సోష‌ల్ మీడియాలో కూడా చిరంజీవి సోష‌ల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే త‌న బ్రాండ్ కి ఏ మాత్రం డోఖా ఉండ‌ద‌ని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఫ్యాన్స్ అభిప్రాయాన్ని చిరు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారో లేదో చూడాలి.
Tags:    

Similar News