నెట్‌ ఫ్లిక్స్‌ సౌత్‌ ఇండియన్ ప్రేక్షకులను లైట్ తీసుకుంటుందా?

Update: 2022-09-26 12:30 GMT
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్‌ ఇండియాలో మార్కెట్‌ ను పెంచుకునేందుకు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. ఇండియాలో నెం.1 ఓటీటీ గా  అత్యధిక ఖాతాదారులను కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇబ్బడి ముబ్బడిగా కంటెంట్‌ ను నెట్‌ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేస్తున్నారు. సౌత్‌ ఇండియాలో స్టార్‌ హీరోల సినిమాలపై నెట్‌ ఫ్లిక్స్ దృష్టి పెట్టింది.

ప్రస్తుతం నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రిమింగ్‌ అవుతున్న కంటెంట్‌ కు తోడు రాబోయే కొన్ని రోజుల్లో వరుసగా భారీ ప్రాజెక్ట్‌ లు రాబోతున్నాయి. అందుకు సంబంధించిన ఒక వీడియోను నెట్‌ ఫ్లిక్స్ వారు యూట్యూబ్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది. కేవలం ఇండియన్‌ ప్రేక్షకుల కోసం వరుసగా పది నుండి పన్నెండు సినిమాలు సిరీస్‌ లు షో లను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

ఈ స్థాయిలో మరే ఓటీటీ లో రావడం లేదు అంటూ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతుంది. అంతా బాగానే ఉంది కానీ నెట్‌ ఫ్లిక్స్ విడుదల చేసిన జాబితాలో సౌత్‌ ప్రేక్షకుల కోసం అన్నట్లుగా పెద్దగా ఏమీ లేకపోవడం కాస్త విచారకరం.

రానా మరియు వెంకటేష్ నటించిన రానా నాయుడు మరియు నయనతార విఘ్నేష్ శివన్ ల యొక్క పెళ్లి డాక్యుమెంటరీ తప్ప సౌత్‌ ప్రేక్షకులకు పెద్దగా కంటెంట్‌ ఏమీ లేదు.

ఈ విషయమై సౌత్‌ సినీ ప్రేమికులు మరియు ఓటీటీ ప్రేక్షకులు నెట్‌ ఫ్లిక్స్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా సౌత్‌ ప్రేక్షకులను లైట్‌ తీసుకోవడానికి కారణం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. నెట్‌ ఫ్లిక్స్ వారు ముందు ముందు అయినా తెలుగు మరియు తమిళ ఇతర సౌత్‌ భాషల్లో ఓటీటీ ఓరిజినల్‌ కంటెంట్‌ ఇవ్వాలంటూ ప్రేక్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

తెలుగు లో వెబ్‌ సిరీస్‌ లకు ఆధరణ పెరుగుతోంది. కనుక నెట్‌ ఫ్లిక్స్ వారు తెలుగు లో వెబ్‌ సిరీస్‌ లను తీసుకు వస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. వరుసగా పెద్ద సినిమాలను స్ట్రీమింగ్‌ చేయడం మాత్రమే కాకుండా ఇంకా కంటెంట్‌ సౌత్‌ ప్రేక్షకులకు కావాలంటూ ఓటీటీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News