అల్లు రామాయణం ప్రస్తుతం తెలుగు- హిందీ చిత్రసీమల్లో హాట్ టాపిక్. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్టు దశలో ఉంది. ఈ సినిమా కోసం దాదాపు 600 కోట్ల బడ్జెట్ వెచ్చించేందుకు బాస్ అల్లు అరవింద్ - మధు మంతెన- నమిత్ మల్హోత్రా సంసిద్ధంగా ఉన్నారని ప్రచారమవుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దంగల్ ఫేం నితీష్ తివారీ దర్శకత్వం వహించనున్నారు.
ఇటీవేల నితీష్ తివారీ దర్శకత్వం వహించిన `చిచ్చోర్`(సుశాంత్-శ్రద్దా) రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ నేపథ్యంలో తదుపరి `రామాయణం`పైకి ఫోకస్ మళ్లించారా? ఇంతకీ ఎవరు కాస్టింగ్ అని ప్రశ్నిస్తే అట్నుంచి ఆసక్తికర సమాధానం వినిపించింది. తదుపరి రామాయణం చిత్రం తెరకెక్కించనున్నాం. అయితే ఇంకా కాన్సెప్టుపైనే కసరత్తు చేస్తున్నాం. ఇది ఓ ట్రయాలజీ తరహాలో ఉంటుంది. ది బెస్ట్ గా తెరకెక్కించడమెలా అన్నదానిపైనే ఆలోచిస్తున్నాం`` అని తెలిపారు.
ఈ చిత్రంలో హృతిక్ - దీపిక జోడీ శ్రీరాముడు- సీతాదేవిగా నటిస్తున్నారా? అన్న ప్రశ్నకు నితీష్ స్పందించారు. అవన్నీ ఇంకా రూమర్లు మాత్రమే. ఇంకా కాన్సెప్టు కి సంబంధించిన పనిలోనే ఉన్నామని కాస్టింగ్ గురించి ఇంకా ఆలోచించలేదని తెలిపారు. అయితే నిర్మాతల వైపు నుంచి ఇప్పటికే హృతిక్- దీపిక- ప్రభాస్ వంటి స్టార్లకు సిగ్నల్స్ వెళ్లిపోయాయి. హృతిక్ - దీపిక జోడీ శ్రీరాముడు- సీతాదేవి పాత్రలో నటిస్తారు. అలాగే ఈ చిత్రంలో అత్యంత కీలకమైన రావణాసురుడి పాత్రలో డార్లింగ్ ప్రభాస్ నటిస్తే బావుంటుందని చిత్రబృందం భావిస్తోందట. ఈ కాస్టింగ్ వందకు రెండొందల శాతం పెర్ఫెక్ట్ అని దర్శకనిర్మాతలు భావిస్తున్నారని స్పెక్యులేషన్ నడుస్తోంది. అయితే ఇది నిజమవుతుందా? అయితే మంచిదే కదా? అని అభిమానులు భావిస్తున్నారు. మరి అల్లు రామాయణం కాస్టింగ్ పరంగా ఎన్ని ట్విస్టులుంటాయో ఆగితే కానీ తెలీదు.