చిరు చరణ్ లు ఒప్పుకుంటారా

Update: 2019-06-24 06:01 GMT
ఇతర బాషా చిత్రాలకు మన హీరోలు డబ్బింగ్ చెప్పడం కొత్తేమి కాదు. ఒకప్పుడు రాజేంద్రప్రసాద్ తో మొదలుకుని మొన్న వెంకటేష్ దాకా అందరూ తమ గాత్రాన్ని అరువిచ్చినవాళ్ళే. హాలీవుడ్ సినిమాల పోకడ ఎక్కువయ్యాక వాటి మీద మనవాళ్ళ ఆసక్తి పెరుగుతోంది. ఫలానా స్టార్ డబ్బింగ్ చెప్పారు అంటే క్రేజ్ ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో నిర్మాణ సంస్థలు దీనికి బడ్జెట్ ఎక్కువవుతున్నా లెక్క చేయడం లేదు.

త్వరలో రాబోతున్న ది లయన్ కింగ్ కొత్త సినిమాకు డిస్నీ సంస్థ ప్లానింగ్ మాములుగా లేదు. ఇప్పటికే హింది వెర్షన్ లో షారుఖ్ ఖాన్-ఆర్యన్ ఖాన్ లతో ముఫాసా సింబా పాత్రలకు డబ్బింగ్ ఇప్పించడానికి ప్లాన్ చేసిన డిస్నీ మలయాళం కోసం మోహన్ లాల్ ఆయన అబ్బాయి ప్రణవ్ మోహన్ లాల్ లను ఒప్పించింది. ఇక్కడ తండ్రులు చిన్న స్టార్లు కాదు కాబట్టి రెమ్యునరేషన్ కూడా భారీగా సమర్పించుకుంటున్నారు.

తాజా అప్ డేట్ ప్రకారం తెలుగు వెర్షన్ కోసం చిరంజీవి చరణ్ ల కోసం డిస్నీ ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది. గతంలో హనుమాన్ కార్టూన్ మూవీ కోసం చిరు గాత్రం ఇచ్చారు. అదే ఫస్ట్ అండ్ లాస్ట్. రామ్ చరణ్ విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ కోసం ప్రేమ్ రతన్ ధన్ పాయోకు తెలుగు మాటలు చెప్పాడు. ఆ తర్వాత ఇంకేది చేయలేదు. మరి ఇప్పుడు లయన్ కింగ్ ఆఫర్ కి ఓకే అంటారా లేదా చూడాలి.

వాస్తవానికి చిరు సైరా డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. హై ఇంటెన్సిటీ ఉన్న మూవీ కావడంతో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. చరణ్ ఆర్ఆర్ఆర్ లో బిజీ కాబోతున్నాడు. ఇంత టైట్ షెడ్యూల్ లో లయన్ కింగ్ కోసం టైం కేటాయించడం అనుమానంగానే ఉంది. ఒకవేళ ఓకే అయితే తండ్రికొడుకుల గొంతులు వినిడం కోసమైనా మెగా ఫాన్స్ లయన్ కింగ్ మీద ఓ లుక్ వేయడం ఖాయం

    

Tags:    

Similar News