శంకర్ భారతీయుడు-2` న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో షూటింగ్ బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేది కాదని శంకర్ ఆ సినిమాని పక్కనపెట్టేసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో RC15 సినిమా వీలైనంత త్వరగా పూర్తిచేసి రిలీజ్ చేయాలని పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. స్ర్కిప్ట్ సిద్దం చేయడం దగ్గర నుంచి సినిమా లాంచ్ చేయడం..షూటింగ్ కి వెళ్లిపోవడం అన్ని చకచకా జరిగిపోయాయి.
దీంతో వచ్చే ఏడాది సినిమా రిలీజ్ అవ్వడం కూడా ఖాయమన్నారు. ఈ సినిమాని త్వరగా రిలీజ్ చేసి శంకర్ తనపై ఉన్న మచ్చని సైతం చేరుపుకోవాలని భావించారు. కానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించలేదు. తాజాగా `భారతీయుడు -2` విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శంకర్ మళ్లీ భారతీయుడు-2 ని తిరిగి షూటింగ్ ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. శంకర్- లైకా ప్రొడక్షన్స్ అధికినేత సుభాస్కరన్ భారతీయుడు-2 షూటింగ్ డిసెంబర్ నుంచి పున ప్రారంభించాలని అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది దీపావళికల్లా సినిమా పూర్తిచేసి రిలీజ్ చేసేలా శంకర్ తో ఒప్పదం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. ఇంకా 100 రోజుల బ్యాలెన్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అటుపై పోస్ట్ ప్రొడక్షన్ పనులకి కొంత సమయం పడుతుంది. ఇలా శంకర్ భారతీయుడిని రీస్టార్ట్ చేస్తే చరణ్ చిత్రాన్ని కొన్ని నెలల పాటు వాయిదా వేయక తప్పదు. శంకర్-సుభాస్కరన్ వివాదం నేపథ్యంలో రామ్ చరణ్...దిల్ రాజుని కన్విన్స్ చేయాలి తప్ప! సుభాస్కరన్ వెనక్కి తగ్గే అవకాశం లేదు. కాబట్టి చరణ్ సినిమా వాయిదా తప్పదనే తెలుస్తోంది. అదే గనుక నిజమైతే చరణ్ సినిమా వచ్చే ఏడాది కూడా రిలీజ్ కష్టమనే తెలుస్తోంది.