మెట్రో న‌గ‌రాల్ని 'ఆర్ ఆర్ ఆర్' మ‌ళ్లీ టార్గెట్ చేస్తుందా?

Update: 2022-03-08 10:30 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌-యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన పాన్ ఇండియా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' మార్చి 15న రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. దీంతో యూనిట్ మ‌ళ్లీ ప్ర‌చారం ప‌నుల‌కు స‌మాయ‌త్తం అవుతోంది. రిలీజ్ కి ఇంకా రెండు వార‌లే స‌మ‌యం ఉంది. దీంతో సినిమాని మ‌ళ్లీ జ‌నాల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేయ‌బోతున్నారు. రిలీజ్ కి రెడీ అయి వాయిదా ప‌డిన‌  సినిమా కాబ‌ట్టి కేవ‌లం ప్ర‌చారం మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. ఉన్న స‌మ‌యంలో సినిమాకి వీలైనంత బ‌జ్ తీసుకురావాలి. మంచి ఓపెనింగ్స్  రాబ‌ట్టాలి. ఇదే 'ఆర్ ఆర్ ఆర్' ముందున్న త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం.

అయితే మునిప‌టంత ఊపు ఇప్పుడు క‌నిపిస్తుందా? అన్న‌ది ఇంకా  క్లారిటీ రాలేదు. సంక్రాంతి సంద‌ర్భంగా రిలీజ్ చేయాల‌ని భావించిన టీమ్ అప్ప‌ట్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది. ముంబై..చెన్నై..హైద‌రాబాద్ లో  ప్ర‌త్యేక ఈవెంట్ల‌ను సెల‌ట్రేట్ చేసింది. చ‌ర‌ణ్‌..తార‌క్..అలియాభ‌ట్..రాజ‌మౌళి అంతా ప్ర‌త్య‌క్షంగా హాజ‌ర‌య్యారు.

అందుకోసం కోట్ల రూపాయ‌లు ప్ర‌చారానికే ఖ‌ర్చు చేసారు. అలియాభ‌ట్ గ‌త సారి 15 రోజులు ప్ర‌చారం కోసం కేటాయించింది. అందుకు కేవ‌లం ఆమెకే అక్ష‌రాలా 3 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చు అయింద‌ని స‌మాచారం. ప్లైట్ టిక్కెట్లు..హోట‌ల్ బిల్స్..ఆమె వ్య‌క్తిగ‌త  సిబ్బంది..ఇలా మొత్తంగా నిర్మాత‌ల‌కు త‌డిపి మోపుడైంది.

300 కోట్లు పెట్టి సినిమా చేసిన నిర్మాత‌ల‌కు 3 కోట్లు పెద్ద మ్యాట‌ర్ కాదు గానీ...ఏదైనా ఖ‌ర్చు ఖ‌ర్చే కాబ‌ట్టి లెక్కించ‌క త‌ప్ప‌దు. కానీ సినిమా అనూహ్యంగా వాయిదా ప‌డ‌టంతో ఆ ఖ‌ర్చు..శ్ర‌మ బూడిద‌లో  పోసిన ప‌న్నిరైంది. అయితే మార్చి 25 రిలీజ్ ని ఆ రేంజ్ లో ప్ర‌చారం చేస్తారా?  లేక‌! తూతూ మంత్రంగా కానిచ్చేస్తారా? అన్న‌ది తెలియ‌దు గానీ ఆ రేంజ్ లో పూనుకుంటే మాత్రం ఖ‌ర్చు త‌ప్ప‌దు.

గ‌త సారి  ఈ సినిమాని  బాలీవుడ్ లో ప్ర‌త్యేకంగా ప్ర‌మోట్ చేసారు. అక్క‌డి మీడియాకి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు..టీవీ షోల్లో పాల్గొని ఛాన్సు దొరిక‌న‌ప్పుడ‌ల్లా 'ఆర్ ఆర్ ఆర్' కి రీచ్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేసారు. చెన్నైలోని ఈవెంట్ నిర్వ‌హించి పాన్ ఇండియా చిత్రాన్ని వీలైనంత చేరేవేసారు. అయితే మ‌రోసారి ఆ ప్రాంతాల్ని మ‌ళ్లీ  చుట్టేసే అవ‌కాశ‌మైతే క‌నిపిస్తుంది. సినిమా బాధ్య‌త‌ల‌న్ని రాజ‌మౌళి తీసుకున్నారు కాబ‌ట్టి..రిలీజ్ వ‌ర‌కూ అయ‌నదే బాధ్య‌త‌.

ప్ర‌చారం కోసం ఆయ‌న ప్లానింగ్ వేరుగా ఉంటుంది. అన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టి చేసినా సినిమాని చివ‌రి నిమ‌షంలో అశ్ర‌ద్ద చేసే అవ‌కాశం లేదు. చ‌ర‌ణ్‌..ఎన్టీఆర్..అలియాని వెంట పెట్టుకుని మ‌ళ్లీ అన్ని మెట్రో సిటీల‌ను తిరిగేయడం ప‌క్కా. 'బాహుబ‌లి' టార్గెట్ గా బ‌రిలోకి దిగే సినిమా 'ఆర్ ఆర్ ఆర్'. కాబ‌ట్టి ప్ర‌చారం ఖ‌ర్చు విష‌యంలో ఏమాత్రం త‌గ్గేదేలా అని అభిమానులు భావిస్తున్నారు. మ‌రి జ‌క్క‌న్న మ‌న‌సులో ఏముందో.
Tags:    

Similar News