అశ్లీల చిత్రాల‌పై హైద‌రాబాద్ బ్యూటీ ఆస‌క్తి!

Update: 2019-08-24 01:30 GMT
`ఏ ఫిలిం బై అర‌వింద్` ఫేం.. హైద‌రాబాదీ అంద‌గ‌త్తె షెర్లిన్ చోప్రా గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. `ప్లేబోయ్` మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ కోసం న‌గ్నంగా ఫోటోషూట్ లో పాల్గొన‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మైంది. ఆ త‌ర్వాత `కామ‌సూత్ర 3డి` చిత్రంలోనూ న‌టించింది. అయితే ఆ సినిమా ర‌క‌రకాల వివాదాల వ‌ల్ల రిలీజ్ కాలేదు. అందాల పోటీల నుంచి ఆరంభం టాలీవుడ్ లో ప్ర‌వేశించిన ఈ బ్యూటీ అటుపై బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అక్క‌డా కెరీర్ ఆరంభం కొన్నిఅవ‌కాశాలు అందుకుంది. ఐటెమ్ గాళ్ గానూ కెరీర్ ని నెట్టుకొచ్చింది.

అయితే ఆ త‌ర్వాత షెర్లిన్ కాంట్ర‌వ‌ర్శీ క్వీన్ గా పాపుల‌ర‌వ్వ‌డంతో అవ‌కాశాలు త‌గ్గాయి. కామ‌సూత్ర 3డిలో న‌టించినా ఆ చిత్ర నిర్మాత రూపేష్ తో గొడ‌వ ప‌డ‌డంతో రిలీజ్ స‌మ‌స్య త‌లెత్తింది. అలా త‌న కెరీర్ కి త‌నే  శ‌త్రువుగానూ మారింద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. షెర్లిన్ బోల్డ్ అవ‌తారం సామాజిక మాధ్య‌మాల్లో నిరంత‌రం ఓ హ‌ట్ టాపిక్. బికినీ .. స్విమ్ సూట్ .. దేనికైనా స‌రే షెర్లిన్ వెన‌కాడ‌దు. ఇటీవ‌లే అర్థ‌న‌గ్న వీడియోల‌తోనూ సామాజిక మాధ్య‌మాల్లో వేడెక్కించింది. షెర్లిన్ స‌రిహ‌ద్దులే లేకుండా చెల‌రేగిపోవ‌డంపై యువ‌త‌రంలో ఘాటైన కామెంట్లు వినిపించాయి.

ఇక‌పోతే బోల్డ్.. లూజ్ క్యారెక్ట‌ర్ అన్న విమ‌ర్శ‌ల‌కు షెర్లిన్ ప్ర‌తిసారీ త‌న‌దైన శైలిలో ఆన్స‌ర్ ఇస్తుంటుంది. బోల్డ్ గా న‌టించినంత మాత్రాన లూజ్ క్యారెక్ట‌ర్ ఉంద‌ని భావిస్తారు. కానీ అది నిజం కాద‌ని చెబుతుంది. ఇక షెర్లిన్ బోల్డ్ యాక్టివిటీస్ చూసి తాను అశ్లీల చిత్రాల్లో న‌టిస్తోందా? అనే సందేహం అంద‌రికీ క‌లుగుతుంది. కానీ దాని వెన‌క ఉన్న అస‌లు ర‌హ‌స్యాన్ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో షెర్లిన్ వెల్ల‌డించింది. ఇదంతా కేవ‌లం త‌న‌ని తాను లైమ్ లైట్ లో ఉంచుకునేందుకు వేసే వేషం అన్న‌ది త‌న వాద‌న‌. ``కెమెరా ముందు  సెక్స్ చేయడం నా వల్ల కాదు. ఎందుకంటే అలాంటి వాటితో నేను సౌక‌ర్యంగా ఉండ‌లేను. అయితే శృంగారం చేస్తున్నట్లు ప్రేక్షకులు ఫీలయ్యేలా నటించడం.. ఆ త‌ర‌హా మూమెంట్స్ ఇవ్వడం.. వెన‌క వైపు నుంచి న‌గ్న‌త్వం అభ్యంత‌రం లేదు. జ‌ర‌గ‌నిదానిని జరిగినట్లు భ్రమింప చేయ‌డం త‌ప్పు కాదు`` అని షెర్లిన్ వ్యాఖ్యానించింది. అంద‌చందాలు ఉన్న‌ది చూపించేందుకే.. దాచుకునేందుకు కాదు! అని త‌న‌దైన ఫిలాస‌ఫీని వ్య‌క్త‌ప‌రిచే షెర్లిన్ తాను చెప్పిందే చేస్తూ నిరంత‌రం హాట్ టాపిక్ గా మారుతోంది. నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ అభిమానుల‌కు మాత్రం ట‌చ్ లో ఉంటోంది.
Tags:    

Similar News