టాలెంటెడ్ యాక్టర్ మరో సెన్సేషనల్ స్టార్ అవుతాడా..?

Update: 2021-03-12 14:30 GMT
టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి కెరీర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చి, 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.హీరోగా చేసిన ఫస్ట్ సినిమాలో తన కామెడీ టైమింగ్‌ తో యూత్ ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 'దంగల్' ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించిన 'చిచ్చోరే' సినిమాలో కీలక పాత్రలో నటించాడు నవీన్. ఈ క్రమంలో తాజాగా 'జాతిరత్నాలు' అనే కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ తో ప్రేక్షకులను పలకరించాడు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా శివరాత్రి రోజున విడుదలై పాజిటివ్ టాక్ తో నడుస్తోంది.

ముఖ్యంగా 'జాతిరత్నాలు' సినిమాలో నవీన్ పోలిశెట్టి యాక్టింగ్ మరియు కామెడీ టైమింగ్ కి ఆడియన్స్ మంచి మార్కులు వేస్తున్నారు. అందుకే ఫస్ట్ డే 4 కోట్లకు పైగా షేర్ రాబట్టి కమర్షియల్ సక్సెస్ దిశగా పరిగెడుతోంది. నవీన్ కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోవడంతో ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. తన స్నేహితుడు విజయ్ దేవరకొండ వలే మంచి ఫాలోయింగ్ తెచ్చుకుని మరో సెన్సేషనల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంటాడని సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే కామెడీ యాంగిల్ లో మాత్రమే ఆ రేంజ్ క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే 'జాతిరత్నాలు' విజయంతో నవీన్ కి పెద్ద నిర్మాతల నుండి ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. తాజాగా ఓ బిగ్ ప్రొడక్షన్ హౌస్ లో సినిమా చేయడానికి నవీన్ పోలిశెట్టి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
Tags:    

Similar News