మా ఎన్నికల పోలింగునకు గడువు దగ్గర పడుతోంది. ఈ నెల 10న మా ఎన్నికలు జరుగుతాయి. అంటే మధ్యలో కేవలం నలభై ఎనిమిది గంటలే టైమ్ ఉంది. దాంతో అటు ప్రకాష్ రాజ్ ప్యానల్ ఇటు మంచు విష్ణు ప్యానల్ దూకుడు పెంచేశాయి. విజయం మాదే అంటున్నాయి రెండు ప్యానల్స్. ఇక అటూ ఇటూ పోటీ చేస్తున్న మెంబర్స్ కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే మా మెంబర్స్ మొత్తం తొమ్మిది వందల దాకా ఉన్నారు. ఇందులో ఎపుడూ ఓటేసేది అయిదారు వందల మంది కంటే మించరు అంటున్నారు. ఇందులో కూడా ఎక్కువ మంది చిన్న నటులే ఓటింగునకు హాజరవుతారు అని కూడా చెబుతారు.
మరి ఈసారి గట్టిగా పోటీ ఉంది. దాంతో హోరా హోరా తప్పకపోవచ్చు అంటున్నారు. ఈ నేపధ్యంలో ప్రతీ ఓటూ కీలకమే. దాంతో పోలింగ్ శాతం పెరుగుతుంది అని తెలుస్తోంది. అయితే పెద్ద హీరోలు, ప్రముఖ నటులు ఈసారి ఎంత మంది తమ ఓటు హక్కుని ఉపయోగించుకుంటారు అన్న డౌట్ వస్తోంది. ఇంత హెవీ కాంపిటేషన్ గతంలో ఎన్నడూ లేదు. ఇపుడు ఏకంగా వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకున్నారు. పైగా ఒక వైపు ప్యానల్ కి మెగా ఫ్యామిలీ కొమ్ము కాస్తూంటే మరో వైపు ప్యానల్ కి సీనియర్ హీరో మోహన్ బాబు అండగా ఉన్నారు. ఆయన కుమారుడే పోటీలో ఉన్నారు. దాంతో ఎవరిని కాదంటే ఏమవుతుందో అన్న ఆలోచన అయితే చాలా మంది నటులలో ఉంది అంటున్నారు.
అందరూ కావాల్సిన వారే. అందరితోనూ పనులు అవసరాలు ఉంటాయి. దాంతో తాము ఓటు పేరిట ఫలానా వారిని మద్దతు అని చెప్పేసుకుంటే రేపటి రోజున కొత్త చిక్కులు వస్తాయని కొందరు నటులు ఆలోచిస్తున్నారని టాక్. ఇక అగ్ర హీరోలు కూడా ఈ ఎన్నికల ప్రచార సరళి పట్ల అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా సాఫీగా జరిగితే బాగుండేది అన్న భావన కూడా వ్యక్తం చేసిన వారు ఉన్నారు. ఇపుడు అంతా హాట్ హాట్ గా ఉండడంతో ఓటింగునకు వెళ్లకపోవడమే మేలు అన్న ఆలోచనతో చాలా మంది ఉన్నారని అంటున్నారు. మరి ఇలా కనుక డుమ్మా కొడితే అది పోలింగ్ మీద పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. దాంతో రెండు ప్యానల్స్ వీరిని ఎలా ఓటింగునకు తీసుకువస్తారో ఆలోచించాలి. ఏది ఏమైనా మాటల తూటాల పేలుడుతోనే ఈసారి మా ఎన్నికలు సాగాయన్నది వాస్తవం.