నడుము మెరుపులతో హార్ట్‌బీట్ పెంచిన బాగ్యశ్రీ
కెమెరా ముందు నెచ్చెలిగా తన అందాన్ని హైలైట్ చేస్తూ ఆమె తాజాగా షేర్ చేసిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాగ్యశ్రీ బోర్సే తన సొగసైన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో నెటిజన్లను మరోసారి ఆకట్టుకుంది. కెమెరా ముందు నెచ్చెలిగా తన అందాన్ని హైలైట్ చేస్తూ ఆమె తాజాగా షేర్ చేసిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా తన అభినయంతో పాటు అందానికి గ్లామర్ టచ్ ఇచ్చిన ఈ ఫోటోలు ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను మరింతగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నడుముతోనే మాయ చేస్తోంది.
బాగ్యశ్రీ కెరీర్ ప్రారంభం హిందీ చిత్రాలతో మొదలైంది. 'యారియాన్ 2' అనే హిందీ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో 'మిస్టర్ బచ్చన్' సినిమాలో హరీష్ శంకర్ దర్శకత్వంలో మెయిన్ హీరోయిన్గా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె నటనతో పాటు, సినిమాలోని పాటల్లో చూపిన గ్లామర్ పర్ఫార్మెన్స్ యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంది.
ఇటీవలి కాలంలో భాగ్యశ్రీ తన ఫోటోషూట్లతో ఫ్యాషన్ ప్రపంచాన్ని అలరిస్తోంది. ఈ ఫోటోల్లో ఆమె సింప్లిసిటీ, అందం, గ్లామర్ ఒకే చోట కుదిరి కనిపిస్తుంది. బ్లాక్ టాప్‌తో ఆమె సాదాసీదా లుక్‌లో కనిపించినా, ఆ హావభావాలు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తాయి. "బ్లాక్ అండ్ వైట్, కానీ బ్యూటీ కలర్‌ఫుల్" అనే కామెంట్లు ఆమె ఫాలోవర్స్ నుంచి పెద్ద ఎత్తున వస్తున్నాయి.
ప్రస్తుతం భాగ్యశ్రీ విజయ్ దేవరకొండ 'VD12'తో పాటు దుల్కర్ సల్మాన్‌తో కలిసి మరో చిత్రంలో నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లు ఆమెకు కమర్షియల్ హిట్లు అందిస్తాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. మంచి పాత్రలు, సరికొత్త ప్రాజెక్ట్‌లతో తన కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్న బాగ్యశ్రీ తన గ్లామర్‌ను కూడా మరింతగా ఎలివేట్ చేస్తోంది. ఈ ఫోటోషూట్లను చూస్తే, బాగ్యశ్రీ తన కెరీర్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.