ఉస్తాద్ రామ్ హీరోగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ది వారియర్'. మాదవన్ తో 'రన్', విశాల్ తో పందెంకోడి, కార్తితో 'ఆవారా' వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ లని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన తమిళ దర్శకుడు ఎన్. లింగుస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ మూవీలో కృతి శెట్టి కథానాయికగా నటించింది.
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ లతో పాటు లిరికల్ వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. రామ్, కృతి అదిరిపోయే స్టెప్పులతో దుమ్ముదులిపేసిన 'బుల్లెట్ సాంగ్' నెట్టింట రికార్డుల మోత మోగిస్తోంది.
ఆదివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈ వెంట్ ని నిర్వహించింది. భారీగా నిర్వహించిన ఈ ఈవెంట్ లోహీరో రామ్, హీరోయిన్ కృతిశెట్టితో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎన్.లింగుస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఈ మూవీతో ఫస్ట్ టైమ్ తెలుగు ఇండస్ట్రీకి వచ్చానని, తనకు హీరో రామ్ చాలా సపోర్ట్ చేశారన్నారు. దర్శకుడి ఆలోచనలకు తగ్గ హీరో దొరకడం నా అదృష్టం అని, భయంకరమైన టైమింగ్ సెన్స్, షార్ప్ నెస్ హీరో రామ్ సొంతం అన్నారు.
నాకు అదృష్టం కుదిరి అన్నీ కరెక్ట్ గా జరిగితే రామ్ తో 10 సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. నేను తీసిన 'రన్, పందెం కోడి, ఆవారా సినిమాలు తెలుగు ప్రేక్షకులు చూశారు. ఫస్ట్ టైమ్ తెలుగు సినిమా చేశా. చాలా రోజుల నుంచి తెలుగులో సినిమా చేయాలనే ఆలోచనలో వున్నాను. థియేటర్లలో ఈ మూవీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే నమ్మకముంది.
'రన్' సినిమా తరువాత నాతో సినిమా చేయాలని నిర్మాత శ్రీనివాస చిట్టూరి వచ్చారు. అప్పటి నుంచి ఆయన, నేను ఇండస్ట్రీలోనే వున్నాం. అది మా అదృష్టం. అది ఇప్పటికి కుదిరింది. నేను అడిగింది ఇచ్చారు. 'వారియర్ 2' కూడా ఆయనకు చేయబోతున్నాను' అన్నారు లింగుస్వామి.
'రన్' తరువాత 20 ఏళ్లు నాతో సినిమా చేయడం కోసం ఎదురుచూశారు. ఆయనతో 20 ఏళ్లు ప్రయాణించడానికి నేను సిద్ధంగా వున్నాను. దేవిశ్రీన్రసాద్ రీ రికార్డింగ్ చేస్తున్న కారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనలేకపోయారని వెల్లడించారు. లింగుస్వామి అన్నట్టుగానే 'వారియర్ 2' నిజంగానే పట్టలెక్కుతుందా? అన్నది తెలియాలంటే జూలై 14 వరకు వేచి చూడాల్సిందే.