వీఎఫ్ ఎక్స్ ప్రాధాన్యత భారతీయ చిత్రపరిశ్రమల్లో అంతకంతకు పెరుగుతోంది. బాలీవుడ్ టాలీవుడ్ అనే విభేధం లేకుండా అన్నిచోట్లా హాలీవుడ్ ప్రమాణాలతో విజువల్ ఎఫెక్ట్స్- గ్రాఫిక్స్ పై శ్రద్ధ పెడుతున్నారు. భారీ బడ్జెట్లు వెదజల్లే నిర్మాతలు మనకు అందుబాటులో ఉన్నారు. బాహుబలి- సాహో - కేజీఎఫ్-ఆర్.ఆర్.ఆర్ లాంటి చిత్రాలు వీఎఫ్ ఎక్స్ ప్రమాణాల్లో హాలీవుడ్ కి ఏమాత్రం తగ్గలేదన్న ప్రశంసలు కురిసాయి. ఇది సౌత్ సాధించిన ఘనవిజయం. అందుకే ఇప్పుడు ఉత్తరాదిన కూడా ఈ తరహా ఎంపికలకు ప్రాధాన్యత పెరిగినట్టే కనిపిస్తోంది. ఇటీవలే రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర భారీ వీఎఫ్ ఎక్స్ తో తెరకెక్కి విజయం సాధించింది. కొన్ని విమర్శల్ని ఎదుర్కొన్నా కానీ బాక్సాఫీస్ వద్ద రణబీర్ - ఆలియా జంట హవా కొనసాగింది.
రణబీర్ తర్వాత ఇప్పుడు మరో బాలీవుడ్ యువహీరో వరుణ్ ధావన్ తెలుగు మార్కెట్ పై పెద్ద రేంజులోనే కన్నేశాడు. దక్షిణాదిన దూసుకు రావాలన్నది అతడి ఆలోచన. ధావన్ నటించిన బాలీవుడ్ చిత్రం 'భేదియా'ను తెలుగులోకి అనువదించి అగ్ర నిర్మాత కం పంపిణీదారు అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే గీతా ఆర్ట్స్ తమ ఛానెల్ లో 'భేదియా-తోడేలు' సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్ ను విడుదల చేసింది. ఇకపైనా ప్రచారంలోను టీమ్ వేగాన్ని పెంచనుందని సమాచారం. ''చిలిపి వరాలే ఇవ్వు'' అనే మెలోడీ పాట తెలుగు వెర్షన్ ను నాయకనాయికలు వరుణ్ ధావన్ - కృతి సనన్ ఇద్దరూ నేర్చుకుంటున్నారని వారే స్వయంగా వేదికపై పాడతారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లో దీనికోసం ఒక ప్రచార వేదికను కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
బాలీవుడ్ తారల ఫీట్స్ చూస్తుంటే తెలుగు బాక్సాఫీస్ పై వారికి కసి ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలు బాహుబలి- ఆర్.ఆర్.ఆర్ లను అలాగే కన్నడ సినిమాలు కేజీఎఫ్ 2- కాంతార చిత్రాలను స్ఫూర్తిగా తీసుకోవాలని వరుణ్ ధావన్ అన్నారు. దక్షిణాది నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని కూడా ప్రశంసలు కురిపించాడు. అతడి మాటలు దక్షిణాది మార్కెట్ పై గురి పెడుతూ వినిపించాయి. ఇక జూ.సల్మాన్ గా పాపులరైన వరుణ్ ధావన్ కి అల్లు అరవింద్ లాంటి దిగ్గజం మద్దతు ఇవ్వడంతో అది టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. వీరంతా కలిసి విశాఖ-విజయవాడ-తిరుపతి లాంటి నగరాల్లోను ప్రచారం చేయనున్నారట.
అయితే బేధియా మూవీ నేపథ్యం తెలుగు ఆడియెన్ కి కొత్తేమీ కాదు. ఇప్పటికే బుల్లితెరపై పలు హాలీవుడ్ సినిమాల డబ్బింగులను ఈ తరహా చూశారు. వాంపైర్ డైరీస్ సహా తోడేలు కాన్సెప్టుతో రూపొందిన థ్రిల్లర్ మూవీలను వీక్షించడం కొత్తేమీ కాదు. అందుకే ఇప్పుడు ధావన్ నటించిన తోడేలు కాన్సెప్ట్ మూవీ ఏ మేరకు మెప్పించనుందో వేచి చూడాలి. చాలా హాలీవుడ్ సినిమాలు ఈ తరహా కథలతో రావడంతో ఇప్పుడు కొత్తగా ఏం చూపిస్తున్నారన్నది వేచి చూడాలి. డబ్బింగులతో వైవిధ్యమైన సినిమాలను ప్రాంతీయ ప్రజలు ఆస్వాధిస్తున్నారు.
మరి ఇలాంటి సమయంలో వస్తున్న బేధియాను ఇరు తెలుగు రాష్ట్రాల్లో సౌత్ లోను ఏ మేరకు ఆదరిస్తారు? అన్నది వేచి చూడాలి. ఇక ఇందులో హాలీవుడ్ రేంజ్ వీఎఫ్ ఎక్స్ వర్కవుటైందా? అన్నది కూడా కీలక అంశం. ట్రైలర్ లో ఉన్నంత గ్రిప్ సినిమాలో ఉంటే గనుక భాషతో పని లేకుండా ఇలాంటి సినిమాలు విడుదలైన అన్నిచోట్లా ఆడేందుకు ఛాన్సుంది. అనువాద శైలి కూడా కనెక్టవ్వాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.