ట్రెండీ టాక్: వైజాగ్ లో టాలీవుడ్?

Update: 2019-12-23 07:20 GMT
ఏపీ-తెలంగాణ విభ‌జ‌న త‌రువాత మొట్ట‌ మొద‌ట‌గా సాగిన ముచ్చ‌ట `టాలీవుడ్ ఎటు వెళుతోంది`?  తెలుగు సినీప‌రిశ్ర‌మ బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రానికి త‌ర‌లి వెళ్లిపోతోంద‌న్న ముచ్చ‌ట హీటెక్కించింది. ఆల్మోస్ట్ తెరాస మంత్రి కేటీఆర్ నోటి నుంచే ఆ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది అప్ప‌ట్లో. విశాఖ‌లో మ‌రో గొప్ప సినీప‌రిశ్ర‌మ అభివృద్ధి చెందాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మతో పోటీప‌డాలని ఆయ‌న ఆకాంక్షించారు. అటుపైనా రాజ‌ధాని అమ‌రావతిలో ఉన్నా మెజారిటీ పార్ట్ షూటింగులు జ‌రుగుతున్న విశాఖ‌కే ఏపీ ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త‌నిస్తుంద‌న్న ముచ్చ‌టా సాగింది. అంతేకాదు విజ‌య‌వాడ కేంద్రంగా ఏపీ ఫిలిం డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ (ఏపీ.ఎఫ్‌.డీ.సీ) అధికారికంగా స్టూడియోల నిర్మాణం విశాఖ‌లోనే జ‌ర‌గ‌నుంద‌ని అందుకు దిగ్గ‌జ సంస్థ‌లు ఆస‌క్తి క‌న‌బ‌రిచాయ‌ని ప్ర‌క‌టించింది.

స‌రిగ్గా ఇదే అంశం ఇప్పుడు మ‌రోసారి ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రం లో ప‌రిపాల‌నా రాజ‌ధానిని నిర్మిస్తున్నాన‌ని ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌కటించ‌డం తో ఉత్త‌రాంధ్ర యావ‌త్తూ ఉత్సాహం క‌నిపిస్తోంది. దీంతో పాటు టాలీవుడ్ వైజాగ్ కి త‌ర‌లి వ‌చ్చేస్తోంద‌న్న ప్ర‌చారం వేడెక్కి పోతోంది. విశాఖ‌ లో ఇప్ప‌టికే రామానాయుడు స్టూడియోస్ ఉంది. ఇక్క‌డ అప్పుడ‌ప్పుడు షూటింగులు చేస్తున్నారు. ఇక కూత వేటు దూరం లోనే అర‌కు లో నిరంత‌రం షూటింగుల‌ తో సంద‌డి నెల‌కొంటోంది. విశాఖ సుంద‌ర‌ వ‌నాలైన‌ పార్క్ లు.. బీచ్ ల‌న్నీ ఎల్ల‌పుడూ షూటింగు ల హ‌డావుడి తో క‌నిపిస్తున్నాయి.

వైసీపీ స‌ర్కార్ ఇప్పుడు వైజాగ్ లో టాలీవుడ్ నెల‌ కొల్పేందుకు ఆస‌క్తి గా ఉంద‌ని ప్ర‌జ‌ల్లో ప్ర‌చారం అవుతోంది. ఇక మూడు రాజ‌ధానుల‌ కు టాలీవుడ్ నుంచి గొప్ప స్పంద‌న వ‌చ్చింది. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ త‌ప్ప‌నిస‌రిగా జ‌ర‌గాల్సి ఉంద‌ని విశాఖ రాజ‌ధాని హ‌ర్షించ‌ ద‌గ్గ నిర్ణ‌యం అని తెలుగు సినీ పెద్ద‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. విశాఖ‌లో మ‌రో కొత్త టాలీవుడ్ అభివృద్ధికి సీఎం నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ భ‌విష్య‌త్ టాలీవుడ్ అన్న ఆలోచ‌న‌ తోనే చాలా కాలంగా సినీపెద్ద‌లంతా ఆ ప‌రిస‌రాల్లో భారీగా భూములు కొన్నారు. కొంద‌రు స్టార్ల‌కు వంద‌ల ఎక‌రాలు ఉంద‌న్న ప్ర‌చారం ఇప్ప‌టి కే వేడెక్కించింది. ఆ క్ర‌మంలోనే సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని అంద‌రూ స్వ‌గ‌తిస్తున్నారు. ఇప్ప‌టికే విశాఖ‌ లో ఫిలింఛాంబ‌ర్ - ఎఫ్.ఎన్.సీ.సీ ఇత‌ర కార్యాల‌యాల్ని ప్రారంభించి యాక్టివిటీస్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ ప్ర‌త్యేకించి ఆర్టిస్టుల సంఘం ఏర్పాటై కార్య‌క్ర‌మాలు చేస్తోంది. ఈ నేప‌థ్యం లో విశాఖ రాజ‌ధానికి అద‌నంగా టాలీవుడ్ కూడా త‌ర‌లి వ‌స్తోంద‌న్న ప్ర‌చారం హోరెత్తుతోంది.

ఇక ఈ రాజ‌ధాని కి మెగా కాంపౌండ్ నుంచి అద్భుత స్పంద‌న ల‌భించింది. మెగాస్టార్ చిరంజీవి జగన్ నిర్ణయం అభివృద్ధి కి బాటలు వేస్తుందని ప్ర‌శంస‌లు కురిపించారు. ఉత్త‌రాంధ్ర వెన‌క‌బాటుత‌నం ఇక‌పై ఉండ‌ద‌ని ఆయ‌న అన్నారు. వికేంద్రీక‌ర‌ణ త‌ప్ప‌నిస‌రిగా జ‌ర‌గాల‌ని ఆకాంక్షించారు. ఈ ఊపు చూస్తుంటే విశాఖ‌లో స్టూడియోల నిర్మాణానికి సినీ పెద్ద‌లంతా ముఖ్య‌మంత్రి వైయ‌స్.జ‌గన్ ని క‌లిసే అవ‌కాశం ఉంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. అయితే వైజాగ్ టాలీవుడ్ పై యువ ముఖ్య‌మంత్రి పాల‌సీ ఎలా ఉండ‌నుంది? అన్న‌ది కీల‌కంగా మారింది. ఇక వైజాగ్ కొత్త వ‌ల‌స నుంచి అర‌కు వ‌ర‌కూ కొండ భూములు మెట్ట భూములు వేలాది ఎక‌రాలు ఖాళీగా ఉన్నాయి. ఇవి క‌మ‌ర్షియ‌ల్ పంట‌ల‌కు అనుకూలం కాదు కాబ‌ట్టి ఆ భూముల్ని టాలీవుడ్ కి కేటాయించేందుకు ఐటీడీఏ తో మాట్లాడి పావులు క‌దిపినా ఆశ్చ‌ర్య‌ పోన‌క్క‌ర్లేద‌న్న ముచ్చ‌టా వినిపిస్తోంది.
Tags:    

Similar News