చిత్రం : ‘విన్నర్’
నటీనటులు: సాయిధరమ్ తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ - జగపతి బాబు - అనూప్ సింగ్ ఠాకూర్ - ముకేష్ రుషి - పృథ్వీ - వెన్నెల కిషోర్ - ఆలీ - రఘుబాబు తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు
కథ: వెలిగొండ శ్రీనివాస్
మాటలు: అబ్బూరి రవి
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్-ఠాగూర్ మధు
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: గోపీచంద్ మలినేని
వరుస విజయాలతో ఊపుమీదున్న సాయిధరమ్ తేజ్ కు ‘తిక్క’ రూపంలో పెద్ద బ్రేక్ పడింది. దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ‘పండగ చేస్కో’తో దెబ్బ తిన్నాడు. వీళ్లిద్దరూ హిట్టు కొట్టి తీరాలన్న కసితో కలిసి చేసిన సినిమా ‘విన్నర్’. ఈ రోజే విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మనసు గెలిచిందా.. సాయిధరమ్ ‘విన్నర్’ అనిపించుకున్నాడా.. చూద్దాం పదండి.
కథ:
సిద్ధార్థ్ (సాయిధరమ్ తేజ్) తండ్రి అంటే అసహ్యంతో చిన్నతనంలోనే ఇంటి నుంచి వెళ్లిపోతాడు. పెరిగి పెద్దయ్యాక ఒక న్యూస్ పేపర్లో క్రియేటివ్ హెడ్ గా పని చేస్తుంటాడు. ఓ పార్టీలో సితార (రకుల్ ప్రీత్)ను చూసి ప్రేమలో పడిపోయిన సిద్ధార్థ్ ఆమె వెంట పడటం మొదలుపెడతాడు. పెద్ద అథ్లెట్ కావాలని కలలు కంటున్న సితార.. సిద్ధార్థ్ అల్లరి కారణంగా తన కెరీర్ ను పక్కనబెట్టి వెంటనే హార్స్ రేసర్ అయిన ఆది (అనూప్ సింగ్)ను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఆ పెళ్లిని తప్పించుకునే క్రమంలో సితార చెప్పిన అబద్ధం కారణంగా సిద్ధార్థ్ .. ఆదితో గుర్రపు పందెంలో పోటీ పడాల్సి వస్తుంది. అసలు గుర్రపు పందేలంటేనే పడని సిద్ధార్థ్.. సితార కోసం ఎలా కష్టపడ్డాడు.. తన స్థానంలో తన తండ్రికి కొడుగ్గా చలామణి అవుతున్న ఆది మీద ఎలా గెలిచి తన తండ్రికి దగ్గరయ్యాడు అన్నది మిగతాకథ.
కథనం - విశ్లేషణ:
విలన్ ఎన్నో ఏళ్ల నుంచి ఒక ఆటలో కొనసాగుతుండటాడు. అతను అందులో నెంబర్ వన్ అయి ఉంటాడు. అతడికి ఆ ఆటలో ఎదురే ఉండదు. ఐతే హీరోకు అప్పటి దాకా ఆ ఆటలో అసలు టచ్చే ఉండదు. అందులో ఓనమాలు కూడా తెలియవు. కానీ ఒక సందర్భంలో ఆవేశపడి విలన్ తో పందెం కాసేస్తాడు. ప్రేమ కోసమో.. ఇంకో కారణంతోనో విలన్ తో పోటీకి సై అంటాడు. ముందు అతడి ట్రైనింగ్ చాలా ఫన్నీగా సాగుతుంది. కానీ ఒక మూమెంట్లో సీరియస్ అయిపోతాడు. కొన్ని రోజుల్లోనే ఆటలో ప్రావీణ్యం సంపాదిస్తాడు. చివరికి పోటీలో నాటకీయ పరిణామాల మధ్య హీరోనే గెలుస్తాడు. ఈ ఫార్మాట్లో మనం ఎన్ని కమర్షియల్ సినిమాలు చూసి ఉంటాం..? ‘విన్నర్’ కూడా ఆ కోవకు చెందిన సినిమానే.
మామూలుగా ఆటలంటే బాక్సింగో.. క్రికెట్టో.. కబడ్డీనో.. ఇంకోటో పెడుతుంటారు. కానీ ‘విన్నర్’లో గుర్రపు రేసులు పెట్టారు. అదీ తేడా. క్రికెట్టో కబడ్డీనో అయితే మనకు ఈజీగా కనెక్టయ్యే ఆటలు కాబట్టి.. ఆ మేరకు అయినా ఎంటర్టైన్మెంట్ ఉండేది. కానీ ‘విన్నర్’కు నేపథ్యంగా గుర్రపు రేసులు ఎంచుకోవడంతో ఆటకు సంబంధించిన వినోదం కూడా పెద్దగా లేకపోయింది. హీరో ఇంట్రడక్షన్ సీన్ నుంచి ఎండ్ టైటిల్స్ పడే ముందు వరకు రొటీన్ గా ఒక ఫార్ములా ప్రకారం సాగిపోయే ‘విన్నర్’ ఎక్కడా కూడా పెద్దగా ఎగ్జైట్మెంట్ కలిగించదు. అక్కడక్కడా కొంచెం కామెడీ మెరుపులు.. రెండు మూడు ఆకర్షణీయమైన పాటలు మినహాయిస్తే ‘విన్నర్’లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు.పాటలు.. ఫైట్లు.. గుర్రపు రేసులు ఓ వర్గం ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయొచ్చు.
గోపీచంద్ మలినేని మొదట్నుంచి మాస్ మసాలా సినిమాలే చేస్తూ వస్తున్నాడు. ఐతే ఇంతకుముందు అతడి కథల్లో మరీ కొత్తదనం లేకపోయినా.. ఉన్నంతలో ఆసక్తికర మలుపులుండేవి. ట్విస్టులతో.. మంచి ఎంటర్టైన్మెంట్ తో సినిమాల్ని ఆసక్తికరంగా నడిపించేవాడు. డాన్ శీను.. బలుపు లాంటి సినిమాలు అలా ఎంటర్టైన్ చేసినవే. కానీ గత సినిమా ‘పండగ చేస్కో’ దగ్గర అతను ట్రాక్ తప్పాడు. ఆ సినిమాను మరీ ఫార్ములాటిగ్గా నడిపించి నిరాశ పరిచాడు. ‘విన్నర్’ కూడా దాదాపుగా అలాగే సాగుతుంది.
ఒక రైతును కొట్టి అతడి పొలంలో కొందరు బడా బాబులు గుర్రప్పందేలు ఆడేద్దామని చూస్తుంటే.. హీరో ఎంట్రీ ఇస్తాడు ‘విన్నర్’లో. అతడు రావడానికి ముందే... ఇప్పుడు ఒకడొస్తాడు.. మీ బెండు తీస్తాడు.. వాడు వీరుడు శూరుడు.. అంటూ హీరో గురించి స్తోత్రం చదవడం.. ఆ తర్వాత హీరో ఎంట్రీ ఇవ్వడం.. అందరినీ ఉతికారేయడం.. ఆపై ఒక పాటేసుకోవడం.. ఇలా ఎప్పుడో ఔట్ డేట్ అయిపోయిన స్టయిల్లో హీరో ఇంట్రడక్షన్ సీన్ ఉన్నపుడే ‘విన్నర్’ సినిమా ఎలా ఉండబోతోందో ఒక అవగాహన వచ్చేస్తుంది. ఇక ఆపై హీరో.. హీరోయిన్ని తొలి చూపులోనే ప్రేమించేయడం.. ఆమెను అల్లరి పెట్టడం.. మధ్యలో రెండు పాటలు.. ఇంతలో ఇంటర్వెల్ బ్యాంగ్.. అక్కడ ఒక సీరియస్ టర్న్.. ఇలా ఎక్కడా కూడా కమర్షియల్ ఫార్మాట్ నుంచి పక్కకు తప్పకుండా ఒక ఫార్ములా ప్రకారం సాగిపోతుంది ‘విన్నర్’. పద్మగా వెన్నెల కిషోర్.. సింగం సుజాతగా పృథ్వీ కొంతమేర వినోదం పంచడంతో ప్రథమార్ధం కాస్తయినా టైంపాస్ చేస్తుంది కానీ.. ద్వితీయార్ధం మాత్రం నిరాశపరుస్తుంది.
గుర్రపు పందేలకు హీరో ట్రైన్ అవ్వడం.. ఆ తర్వాత పోటీకి దిగడం..ఈ నేపథ్యంలో కథనాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దుకునే అవకాశమున్నా దర్శకుడు ఉపయోగించుకోలేదు. గుర్రపు పందేలన్నవి తెలుగు సినిమాకు కొత్త. అలాంటపుడు దానికి సంబంధించిన ట్రైనింగ్.. రేసుల్ని కొత్తగా.. ఆసక్తికరంగా చూపించేందుకు ఆస్కారముంది. కానీ గోపీచంద్ ఇక్కడ కూడా రొటీన్ ఫార్మాట్లో కథనాన్ని నడిపించేశాడు. ఫస్టాఫ్ లో పృథ్వీని పెట్టినట్లే కామెడీ వాయిద్యానికి రెండో అర్ధంలో ఆలీని పెట్టారు. కానీ ఆలీ కామెడీ పెద్దగా పండలేదు. ఓపక్క గుర్రప్పందేలకు డెడ్ లైన్ దగ్గర పడుతుంటుంది. హీరో మాత్రం కాలక్షేపం చేస్తుంటాడు. చివరికి క్లైమాక్స్ దగ్గర పడుతున్న టైంలో హీరో అలర్టవుతాడు. భజరంగభళి అంటూ ఒక ఇన్ స్పైరింగ్ సాంగ్ వస్తుంది. అది అయ్యేలోపు హీరో రేసుకు రెడీ అయిపోతాడు. క్లైమాక్సులో గుర్రపు రేసును కూడా ఎగ్జైటింగ్ గా మలచలేదు. తండ్రీకొడుకుల బంధానికి సంబంధించి ఎమోషన్ కూడా అంతగా పండలేదు. జగపతి-సాయిధరమ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఫోర్స్ డ్ గా అనిపిస్తాయి. ఐతే జగపతి బాబుతో ముడిపడ్డ కొన్ని సన్నివేశాలే ఉన్నంతలో పర్వాలేదనిపిస్తాయి. ఓవరాల్ గా ‘విన్నర్’ ఫార్ములాటిక్ కమర్షియల్ సినిమాల్ని మెచ్చేవారికి ఓకే అనిపించొచ్చు. గత కొన్నేళ్లుగా కొత్త తరహా వినోదానికి అలవాటు పడి.. అదే తరహా సినిమాలే కోరుకునే వారిని మాత్రం నిరాశ పరుస్తుంది.
నటీనటులు:
సాయిధరమ్ తేజ్ ఎప్పట్లాగే ఎనర్జిటిగ్గా కనిపించాడు. అతడి లుక్ బాగుంది. నటన రొటీన్ గా అనిపిస్తుంది. అతను కొత్తగా చేయడానికి ఏమీ లేకపోయింది. మంచి డ్యాన్సర్ అయిన సాయిధరమ్ ‘విన్నర్’లో తన టాలెంట్ చూపించడానికి పెద్దగా అవకాశం దక్కకపోవడం ఆశ్చర్యకరం. అతడి నుంచి అదిరిపోయే డ్యాన్సులు ఆశించేవారికి నిరాశ తప్పదు. చాలా చోట్ల సాయిధరమ్.. తన మావయ్యల్ని అనుకరించే ప్రయత్నం చేశాడు. కొన్ని చోట్ల చిరంజీవి బాడీ లాంగ్వేజ్ స్పష్టంగా కనిపిస్తుంటుంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటన పరంగా చేసిందేమీ లేదు. ఆమె గ్లామర్ డోస్ బాగా పెంచింది. గతంలో ఏ సినిమాలోనూ లేనంత సెక్సీగా ఇందులో కనిపించింది. జగపతి బాబు నటన ఓకే కానీ.. ఆయన ప్రత్యేకత చూపించే పాత్ర ఇది ఎంతమాత్రం కాదు. విలన్ అనూప్ సింగ్ ఠాకూర్ కూడా చేయాడనికేమీ పెద్దగా లేకపోయింది. విలన్ పాత్రకు తగ్గ ఆహార్యం ఉంది కానీ.. పాత్ర తేలిపోవడంతో అతనూ అలాగే కనిపించాడు. సింగం సుజాతగా పృథ్వీ.. పద్మగా వెన్నెల కిషోర్ కొన్ని పంచ్ లు పేల్చారు. ఆలీ పాత్ర పండలేదు. ముకేష్ రుషి.. సురేష్.. రఘుబాబు.. వీళ్లంతా మామూలే.
సాంకేతిక వర్గం:
తమన్ పాటలు పర్వాలేదు. పిచ్చోణ్ని అయిపోయా.. ఓ సితార పాటలు మంచి కిక్కిస్తాయి. మిగతా పాటలేవీ కూడా అంతగా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం నిరాశ పరుస్తుంది. ఏదో రొటీన్ గా వాయించేశాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాల్ని ఎలివేట్ చేయలేకపోయింది. ఛోటా కె.నాయుడు కెమెరా పనితనం కూడా ఆకట్టుకోదు. అలాంటి సీనియర్ కెమెరామన్ నుంచి ఇంకా గొప్ప ఔట్ పుట్ ఆశిస్తాం. ఆయన ఏదో మొక్కుబడిగా లాగించేసినట్లు అనిపిస్తుంది. అబ్బూరి రవి మాటలు పర్వాలేదు. దర్శకుడు గోపీచంద్ మలినేని ‘విన్నర్’ కథ విషయంలో ఎలా ఎగ్జైట్ అయిపోయాడో మరి. గుర్రపు పందేల నేపథ్యం కొత్తగానే అనిపించినా.. వాటిని సరిగా ప్రెజెంట్ చేయలేకపోయాడు. స్క్రీన్ ప్లేలో ఏ ప్రత్యేకతా చూపించలేకపోయాడు. రొటీన్ గా.. ఫార్ములా ప్రకారం వెళ్లిపోయాడు.
చివరగా: విన్నర్.. మనసులు గెలవలేదు
రేటింగ్- 2.5/5
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre