ఎన్టీఆర్‌ తర్వాత చరణ్‌ తో... కుర్రాడిని ఇక ఆపడం కష్టమే!

Update: 2022-06-03 13:30 GMT
యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ 30 సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాకు తమిళ యువ సంగీత సంచలనం అనిరుథ్ రవిచంద్రన్‌ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే తమిళ సూపర్ స్టార్‌ రజినీ కాంత్‌ సినిమాకు సంగీతాన్ని అందిస్తూ బాలీవుడ్‌ లో కూడా సందడి చేస్తున్న ఈయన టాలీవుడ్‌ లో బిజీ అవ్వబోతున్నాడు.

తెలుగు లో ఇప్పటి వరకు అజ్ఞాతవాసి.. జెర్సీ  మరియు గ్యాంగ్ లీడర్‌ సినిమాలకు సంగీతాన్ని అందించాడు. ఆ మూడు సినిమాలు కూడా కమర్షియల్‌ గా సక్సెస్ కాలేదు. అందుకే మళ్లీ అవకాశం కోసం వెయిట్‌ చేయాల్సి వచ్చింది. తెలుగు లో ఆఫర్లు లేని సమయంలో తమిళనాట నెం.1 మ్యూజిక్ డైరెక్టర్ గా ఈయన దూసుకు పోయాడు. ఇప్పుడు తెలుగు లో ఈయన టైమ్‌ వచ్చినట్లుగా ఉంది.

ఇటీవలే ఎన్టీఆర్‌ 30 సినిమాకు సంగీతం అందించే అవకాశం దక్కించుకున్న అనిరుథ్‌ తాజాగా రామ్‌ చరణ్ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపిక అయ్యాడని సమాచారం అందుతోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్‌ చరణ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ లో రామ్‌ చరణ్‌ ఒక సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.

గౌతమ్‌ తిన్ననూరి సినిమా దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. ఈ ఏడాది చివర్లోనే ఆ సినిమా పట్టాలెక్కబోతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. దాంతో సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ తో పాటు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగబోతున్నాయట. ఇటీవలే అనిరుథ్‌ ను గౌతమ్ తిన్ననూరి కలవడం.. చర్చలు జరపడం జరిగిందట.

రామ్‌ చరణ్‌ మూవీకి అనిరుథ్‌ సంగీతం విషయంలో త్వరలోనే ఒక క్లారిటీ అధికారికంగా రాబోతుంది. గౌతమ్ తిన్ననూరి గత చిత్రం జెర్సీ కి అనిరుథ్‌ వర్క్ చేశాడు. ఇద్దరి కాంబోలో మంచి మ్యూజిక్‌ ను ప్రేక్షకులకు అందించారు.

కనుక మరోసారి వీరిద్దరి కలయిక రావడం మంచిదే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా ఎన్టీఆర్‌ మరియు చరణ్ మూవీస్ తో తెలుగు లో ఎదురు లేని సంగీత దర్శకుడిగా అనిరుథ్ మారబోతున్నాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News