గత రెండేళ్లతో పోలిస్తే మన స్టార్స్ లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనాకు ముందు ఏడాదికి ఒకటి అర సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన స్టార్ హీరోలు కరోనా తరువాత గేర్ మార్చేశారు. ఒక సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంటే వరుసగా రెండు మూడు ప్రాజెక్ట్ లని లైన్ లో పెట్టేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సెట్స్ పై సందడి చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ స్టర్ ఆది సాయి కుమార్ వరకు నాలుగైదు ప్రాజెక్ట్ లతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు.
స్టార్ హీరోల్లో మాత్రం వరుస భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా వుంది మాత్రం ఇద్దరే. మెగాస్టార్ చిరంజీవి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. మెగాస్టార్ ఇటీవల 'ఆచార్య'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీ తరువాత చిరు మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. మోహన్ రాజా తో 'లూసీఫర్' రీమేక్ ఆధారంగా 'గాడ్ పాదర్', మెహర్ రమేష్ తో 'వేదాలం' రీమేక్ ఆధారంగా 'భోళా శంకర్' చిత్రాతో పాటు బాబి డైరెక్షన్ లో 'వాల్తేరు వీరయ్య' చిత్రాల్లో నటిస్తున్నారు.
ప్రభాస్ కూడా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల 'రాధేశ్యామ్'తో తీవ్రంగా నిరాశ పరిచిన ప్రభాస్ ప్రస్తుతం మూడు భారీ మూవీస్‌లలో నటిస్తున్నారు. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో 'సలార్' చేస్తున్నారు.
ఇప్పటికే 'ఆది పురుష్' షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. మరో పక్క నాగ్ అశ్విన్ తో 'ప్రాజెక్ట్ కె' చేస్తున్నారు. ఇలా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా వున్న ఈ ఇద్దరు స్టార్ లతో విడి విడిగా స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య రెండు భారీ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.
అందులో చిరుతో చేయనున్న మూవీకి వెంకీ కుడుముల డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు కూడా. ఇదే సమయంలో ప్రభాస్ తోనూ మారుతి డైరెక్షన్ లో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తూనే వున్నాయి. అయితే ఈ ఇద్దు స్టార్ లలో దానయ్య ఎవరి సినిమాని ముందు పట్టాలెక్కిస్తాడన్నది ఇప్పటికీ సస్పెన్స్ గానే వుంది. మెగాస్టార్, ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నారు. ఎవరూ ఖాలీగా లేరు.
డైరెక్టర్ లు ఇద్దరూ ఫుల్ క్లారిటీతో ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో రెడీగా వున్నా హీరోల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ముందు ఎవరి సినిమా పట్టాలెక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. గత కొన్ని రోజులుగా ఇద్దరు హీరోల కోసం నిర్మాత డీవీవీ దానయ్య ఎదురుచూస్తున్నారు. అయితే ఇద్దరూ వారి వారి ప్రాజెక్ట్ లతో బిజీగా వుండటం వల్ల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో దానయ్యకు ముందు మెగాస్టార్ , ప్రభాస్ లలో ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది,