కంటెంట్ లేకుండా.. న్యూడ్ ఫొటోల మీద బాలీవుడ్ చర్చ..!

Update: 2022-08-06 10:43 GMT
ఇండియన్ సినిమాలో ఆధిపత్యం చలాయిస్తూ వచ్చిన బాలీవుడ్ పరిస్థితి ఇప్పుడు మరీ అద్వాన్నంగా తయారైందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రేజీ కాంబినేషన్స్.. భారీ బడ్జెట్ సినిమాలు చేసినా బాక్సాపీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. దీనికి కారణం కంటెంట్ మీద దృష్టి పెట్టకుండా.. ఇతర అంశాల మీద ఫోకస్ చేయడమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఒకప్పుడు కంటెంట్ మరియు సాంకేతిక విషయంలో హిందీ చిత్ర పరిశ్రమ మిగతా ఇండస్ట్రీలకు మార్గదర్శకంగా నిలిచేవి. కానీ ఇప్పుడు సౌత్ నుంచి హై టెక్నికల్ వాల్యూస్ తో వరల్డ్ క్లాస్ సినిమాలు వస్తుంటే.. బాలీవుడ్ నుంచి పేలవమైన కంటెంట్ బయటకు వస్తోంది. దానికి తగ్గితే ఫలితాన్ని అందుకుంటున్నారు.

తమ సినిమాలకు వందల కోట్ల కలెక్షన్స్ అంటూ గొప్పలు పోయినవారు.. ఇప్పుడు కనీస ఓపెనింగ్స్ తెచ్చుకోడానికి నానా తంటాలు పడుతోంది. అదే సమయంలో మన సినిమాలు నార్త్ లో దుమ్మురేపుతున్నాయి. సరికొత్త ఒరిజినల్ కంటెంట్ తో  సినిమాలు రూపొందిస్తూ ఉత్తరాది మార్కెట్ లో సత్తా చాటుతున్నారు.

ఇప్పుడు బాలీవుడ్ పేరు చెప్తే.. ప్లాప్ చిత్రాలు - కంటెంట్ లేని సినిమాలు - కోట్లు కుమ్మరించి నాసిరకం సాంకేతిక విలువలతో తీసిన సినిమాలు - హీరోల న్యూడ్ ఫొటోలు వంటివే గుర్తుకు వచ్చే దుస్థితి ఏర్పడిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి బీటౌన్ లో ఇప్పుడు వాటి మీద ఎక్కువ చర్చ జరుగుతోంది.

ఇటీవల కాలంలో ఒకటీ రెండు హిందీ సినిమాలు మినహాయించి మిగిలినవన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాలు చవిచూశాయి. 'బాహుబలి' - RRR రేంజ్ లో మేం కూడా సినిమాలు తీయగలం అంటూ వందల కోట్ల బడ్జెట్ పెట్టి చేతులు కాల్చుకున్నారు. ప్రతిష్టాత్మకంగా పేర్కొనబడిన చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్నాయి.

కేవలం భారీతనం - అదనపు హంగుల మీద దృష్టి పెట్టి కంటెంట్ ను లైట్ తీసుకోవడం.. ప్రమోషన్లను గాలికి వదిలేసి ఫోటో షూట్స్ వంటి ఇతర అంశాల మీదకు దృష్టి మళ్లించడమే బాలీవుడ్ పతనానికి కారణమవుతున్నాయనేది విశ్లేషకులు చెప్పే మాట.

బాలీవుడ్ హీరోల న్యూడ్ ఫోటో షూట్స్ ఈ మధ్య ఇండస్ట్రీ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. న్యూ ట్రెండ్ పేరుతో ఒంటి మీద నూలుపోగు లేకుండా ఫోజులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేసుకుంటున్నారు.

ఇప్పటి వరకూ గ్లామర్ పేరుతో హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ చేస్తే.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ నగ్నంగా ఫోటో షూట్స్ చేస్తూ కొత్త పద్ధతికి తెర లేపారు. సినిమాలో పాత్ర పరిధి మేరకు న్యూడ్ గా కనిపిస్తే సరే. కానీ అందుకోసమే ఫోటోలు దిగడమే అభ్యంతరంకరం. అందుకే రెండు రోజులకోసారి 'బాయ్ కాట్ బాలీవుడ్' అని నార్త్ జనాలే ట్రెండ్ చేసే పరిస్థితి వచ్చింది

అయితే ఇప్పటికైనా బాలీవుడ్ మేలుకోకపోతే కష్టమే అని సినీ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. తమ వైఫల్యాలను తెలుసుకొని.. ఎక్కడ లోపం జరుగుతుందో విశ్లేషించుకోవాలని సూచిస్తున్నారు. మిగతా అంశాల మీద దృష్టి పెట్టకుండా.. ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్ ను కోరుకుంటున్నారో తెలుసుకొని.. అలాంటి సినిమాలు చేయాలని అంటున్నారు. మరి బాలీవుడ్ ఈ అంశాలను గ్రహించి తిరిగి పుంజుకుంటుందేమో చూద్దాం.
Tags:    

Similar News