నటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన `అఖండ` సంచలన వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీలో టిక్కెట్ రేట్లు తగ్గినా `అఖండ` వేగం ముందు అవేవీ సమస్య కాలేదని ప్రూవైంది. డిసెంబర్ 2న రిలీజ్ అయిన `అఖండ`కు ప్రేక్షకులు బ్రహరథం పడుతున్నారు. ఓమిక్రాన్ లాంటి కరోనా కొత్త వేరియంట్ గుబులు ఉన్నా `అఖండ` ముందు ఆ భయాలు ఎక్కడా కనిపించలేదు. థియేటర్ కి వెళ్లాలి.. ` అఖండ` చూడాలి..అన్న తపన ప్రజల్లో సన్నివేశం మారింది. తాజాగా గుంటూరు జిల్లాలోని `అఖండ` చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఏకంగా ట్రాక్టర్ కట్టించుకుని థియేటర్ కి చేరుకున్నారు.
గుంటూరులోని ఎస్ ఆర్ టీ సినిమాస్ వద్దకి అభిమానులు నేరుగా ట్రాక్టర్ మీద తరలివచ్చారు. అందులో అంతా మహిళలు కావడం విశేషం. ఎంతో అభిమానంగా బాలయ్య సినిమాను చూడాలన్న ఉత్సాహం వాళ్లలో కనిపిస్తుంది. పల్లెటూరి మహిళాభిమానులు ఇలా థియేటర్ కి రావడం అన్నది నిజంగా షాకింగ్ అని చెప్పాలి. ఒకప్పటి పాత రోజుల్లో మహిళలు ఇలా ట్రాక్టర్లపైనా..ఎండ్ల బండ్లపైనా సినిమాలు చూడటానికి వచ్చేవారు. ఎన్టీఆర్ ..ఏఎన్నార్.. కృష్ణ.. శోభన్ బాబు తరంలో ఇలాంటి సన్నివేశం కనిపించేది. ఆ తర్వాత చిరంజీవి...వెంకటేష్..నాగార్జున..బాలయ్య తరం లోనూ ఇలాంటివి చూసాం.
కానీ ప్రస్తుత తరంలో అది లేదు. డిజిటల్ యుగంలో ఉన్నాం. అయినా సరే బాలయ్య కోసం ఇంత మంది అభిమానులు ట్రాక్టర్ మీద వచ్చారంటే దాన్ని సంచలనంగానే భావించాలి. అంత ఇంపాక్ట్ కేవలం బాలయ్య కు మాత్రమే సాధ్యమని `అఖండ`తో రుజువైంది. తాజా విక్టరీ దృష్ట్యా 2021 ని బాలయ్య నామ సంవత్సరంగానే భావించాలి. ఈ ఏడాది రిలీజ్ అయిన ఒకే ఒక్క అగ్ర హీరో సినిమా `అఖండ` కావడం విశేషం. తదుపరి ఇయర్ ఎండ్ లో పుష్ప - ది రైజ్ చిత్రం విడుదలవుతోంది. అల్లు అర్జున్ ఎలాంటి రికార్డులు అందుకుంటాడో వేచి చూడాలి. పుష్ప చిత్రం పాన్ ఇండియా కేటగిరీలో రిలీజవుతుండడంతో తొలి వీకెండ్ నాటికే 200కోట్లు పైగా వసూలవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మూవీ బిజినెస్ రేంజు మరో లెవల్లో సాగింది.